
మరోవైపు బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయానికి రాలేకపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీటు కోసం పోటీ చేసే అభ్యర్థి ఎంపికలో ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా చురుకుగా పాల్గొంటున్నట్లు సమాచారం. బీజేపీ నుంచి ముగ్గురు పేర్లను హైకమాండ్‌కు పంపినట్లు టాక్ ఉంది . 2023 ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డి అలాగే ఇద్దరు మహిళా నాయకురాళ్లు. ఆ మహిళల్లో ఒకరు కీర్తి రెడ్డి, మరొకరు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన, అలనాటి స్టార్ హీరోయిన్ జయసుధ.
జయసుధ అప్పట్లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్‌గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ అనుభవం కారణంగానే ఈసారి ఆమె పేరు ప్రతిపాదనలోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇప్పటికే హైకమాండ్ జయసుధను దాదాపు ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఎక్కువగా నివసించే ప్రాంతం కావడంతో జయసుధకు ఆ వర్గాలపై సాన్నిహిత్యం ఉంది. ఈ కారణంగానే ఆమెకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.
అదనంగా, ఆమె సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావడంతో, మహేష్ బాబు అభిమానుల మద్దతు కూడా బీజేపీకి లభించవచ్చని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జయసుధ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఆమెను బీజేపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో రానుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ వార్త బయటకు రావడంతో ప్రజల ప్రతిస్పందన వేరే స్థాయిలో ఉంది. “హైకమాండ్ ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందో తెలియదు గానీ, సినీ సెంటిమెంట్‌ను బీజేపీ బాగా వాడుకుంటోంది” అంటూ రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.