
వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న చిత్ర బృందం ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ను మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది.ఈ చిత్రానికి సంబంధించి వరుస అప్డేట్ ఇస్తున్నారు. ఈరోజు ఉదయం సంగీత దర్శకుడు థమన్ ఒక క్రేజీ డాన్స్ నెంబర్ ఉంటుందంటూ రివిల్ చేశారు. అయితే మేకర్స్ మాత్రం ఒకటి కాదు రెండు చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉంటాయంటు తెలియజేయడం జరిగింది. అది కూడా ఈరోజు నుంచి కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నట్లు చిత్ర బృందం కన్ఫామ్ చేసింది. దీంతో రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ నుంచి డబల్ డాన్స్ ఫిస్ట్ లు ఉంటాయని చెప్పవచ్చు. దీంతో ఈ విషయం విన్న అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ప్రభాస్ కి జోడిగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహన్ వంటి వారు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఇందులో సంజయ్ దత్, యోగి బాబు, బ్రహ్మానందం,తదితర నటీనటులు ఇందులో నటించబోతున్నారు. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. సలార్ 2, కల్కి 2, ఫౌజీ , స్పిరిట్, తదితర చిత్రాలలో నటించబోతున్నారు. మరి హర్రర్ జోనర్ తో వస్తున్న రాజా సాబ్ చిత్రంతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.