
ఇప్పటికే జపాన్లో 4,000 మందికి పైగా ఈ వ్యాధి సోకిందని దీంతో వారంతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. చాలా చోట్ల పాఠశాలలు కూడా మూసివేసినట్లుగా తెలుస్తోంది. జపాన్ లో ఫ్లూ రోగుల సంఖ్య సాధారణంగా వస్తూ ఉన్నప్పటికీ ఈ ఏడాది ఆ సంఖ్య చాలా పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడ వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ వైరస్ ఆసియా అంతటా కూడా వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. అందుకే ముందు జాగ్రత్తగా వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలి అంటూ ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి పౌరులను హెచ్చరిస్తున్నారు.
దీంతో ఈ కేసులు ప్రారంభం పెరుగుదల వల్ల అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో అక్కడ వైద్యులు కాలనుగుణంగా ఫ్లూ వైరస్ అంటూ పిలుస్తున్నారు. దీని తీవ్రత సమయాన్ని బట్టి ఇండియాతో సహా ఇతర దేశాలకు కూడా హెచ్చరికలను తెలియజేస్తున్నారు. ఈ వైరస్ వల్ల శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయని వెల్లడిస్తున్నారు. జపాన్ లో టోక్యో, ఓకినావా, కగోషియాలోని మరిన్ని కేసులు బయటపడినట్లు తెలియజేస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాలలో పాఠశాలలో కూడా బంద్ చేసినట్లు తెలుపుతున్నారు. ఫ్లూ వైరస్ అనేది విభిన్న జాతిదని ఇది మునుపటికంటే శక్తివంతమైనదిగా పనిచేస్తుందని తెలుపుతున్నారు.
ఈ ఫ్లూ వైరస్ H3N2 అనే జాతి వల్ల వస్తుందట. వృద్ధులు, పిల్లలపైన తీవ్ర అనారోగ్యానికి గురై ఎలా చేస్తుందని తెలియజేస్తున్నారు నిపుణులు. అందుకే ప్రతి ఒక్కరు టీకాలు వేయించుకోవాలని సూచిస్తున్నారు.