సంస్కృత భాష అనేది భారతదేశానికి చెందిన ఒక పురాతనమైన అలాగే శాస్త్రీయ భాష.. సంస్కృతం భారత దేశంలోనే పుట్టింది.అలాగే హిందూ,జైన మతాలకు, బౌద్ధ మతాలకు ప్రధాన భాషగా ఉంది.అందుకే దీనిని అమృత భాష అని కూడా పిలుస్తారు. పురాతన గ్రంథాలలో ఉండే సంస్కృత భాష ద్వారా భారతదేశ సంస్కృతిని నిరంతరంగా తెలియజేస్తుంది..అలాంటి సంస్కృత భాష తెలిసిన వాళ్ళు అన్ని భాషలు తెలుసుకోగలుగుతారు అంటారు. కానీ వేరే ఇతర భాషలు తెలిసినవారికి సంస్కృతాన్ని అర్ధం చేసుకోవడం కష్టం. సంస్కృతాన్ని దైవ భాష దేవ భాష అని అంటారు. సంస్కృత భాష అన్ని భాషలకు మూలం ఒక తల్లి లాంటిది. ఇక ఈ సంస్కృత భాష అనేది మన భారత దేశంలోనే పుట్టింది కానీ భారతదేశంలో పుట్టి ప్రపంచమంతా విస్తరించింది. కానీ మన దేశంలో పుట్టిన సంస్కృతాన్ని మన దేశ ప్రజలు పట్టించుకోరు..సంస్కృతం పై విరక్తి పడతారు. కానీ సంస్కృతం తెలిసిన వాళ్ళు అన్ని భాషలను అవగాహన చేసుకోగలుగుతారు.ఇక వేరే భాష తెలిసినవారు సంస్కృతాన్ని అవగాహన చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. 

సంస్కృతం అనేది అన్ని భాషలలాగా తొందరగా అర్థం కాదు. కానీ సంస్కృతాన్ని అర్థం చేసుకుంటే అది అద్భుతమే. దాన్ని మొదట అర్ధం చేసుకో గలగాలి. అయితే మన దేశంలో పుట్టిన సంస్కృత భాషని మనం పట్టించుకోకపోయినప్పటికీ ఇతర దేశాలు మాత్రం సంస్కృత భాషను చాలా గౌరవిస్తాయి. ముఖ్యంగా జపాన్ లో ఇప్పుడు పెద్ద ఎత్తున సంస్కృత భాష పై పరిశోధనలు చేస్తున్నారు. జపాన్ లో సంస్కృత గ్రంథాలను గ్రంథస్తం చేసేటటువంటి పరిశోధకులు బాగా పెరిగిపోయారు. జపాన్ దేశంలో సంస్కృత భాషని పెద్ద ఎత్తున వ్యాప్తి చేసే కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి.అలా విదేశాలలో సంస్కృత భాష ని ఎంతలా గౌరవిస్తున్నారో దాని గురించి ఎంతలా రీసర్చ్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు.

కానీ మన భారతీయులు మాత్రం సంస్కృత భాషని అంతగా పట్టించుకోరు. అంతేకాదు ఇప్పటి జనరేషన్ వారికి అసలు సంస్కృత భాష అంటే ఏంటో కూడా తెలియదు. అలాగే ఎంతో పవిత్రంగా భావించే సంస్కృత భాషని నేటి విశ్వవిద్యాలయాల్లో, పాఠశాలల్లో ఎక్కువగా చెప్పడం లేదు.అలాగే ఏవో కొన్ని విశ్వవిద్యాలయాలు, స్కూల్స్ తప్ప మిగతా ఎక్కడ కూడా సంస్కృత భాషను బోధించడం లేదు.విదేశాలు ఎంతో గౌరవిస్తున్న ఈ సంస్కృత భాష ప్రాముఖ్యతను గుర్తించి వివిధ సంస్థలు మళ్లీ భారతదేశంలో సంస్కృత భాషని బోధించాలని కృషి చేస్తున్నారు.. అన్ని భాషలకు మూలమైనటువంటి సంస్కృత భాషని కచ్చితంగా నేర్చుకోవాలి.అలాగే భారతదేశం యొక్క సంస్కృతిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సంస్కృతం వచ్చి ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: