ఏపీలో వైఎస్ జగన్ అందరికి ఆమోదయోగ్యమైన పధకాలు రూపొందిస్తూ.. వాటిని పక్కాగా అమలు చేస్తూ దూసుకుపోతున్నారు.  పక్కాగా అమలు చేయడం ఎంతటి శ్రమ ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.  అయితే, ఇప్పుడు జగన్ తన అధికారిక నివాసాన్ని ఢిల్లీకి మారుస్తున్నాడు.  ఎందుకో ఏంటో తెలుసుకుందాం.  మాములుగా ఢిల్లీ వెళ్ళినపుడు ఏపి ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడ ఉంటారు.. అని అంటే వెంటనే చెప్పే సమాధానం ఏపి భవన్ లో అని అంటారు.  నిజమే..ఢిల్లీలో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన భవన్ ఒకటి ఉంటుంది.  రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు అక్కడి అధికారులు చూసుకుంటుంటారు.  


అయితే, ఇప్పుడు ఢిల్లీలో జగన్ ఏపి భవన్ కాకుండా మరో ఇంటిని కూడా తీసుకున్నారట.  అది ఇప్పుడు తీసుకున్నది కాదు.  చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఢిల్లీలోని జన్ పద్ లో సోనియా ఇంటికి కూతవేటు దూరంలో బాబు ఓ ఇంటిని తీసుకున్నారు.  కేంద్రం బాబుగారికి ఓ ఇంటిని ఇచ్చింది.  ఆ ఇంటిని దాదాపు ఐదుకోట్ల రూపాయలు పెట్టి అధునాతనంగా తీర్చిదిద్దారు.  అయితే, బాబు ఆ ఇంట్లో ఒక్కసారిగా ఉండలేదు.  హైదరాబాద్ లో గొడవ.. హైదరాబాద్ నుంచి సారంగమా మొత్తాన్ని అమరావతికి షిఫ్ట్ చేయడం.. అక్కడ ప్రభుత్వ ఖర్చుతో ఇంటిని తీసుకోవడం వంటివి చేయడంతో.. ఢిల్లీ విషయం బయటకు రాలేదు.  


అయితే, అయితే, 2019లో బాబుగారు ఓడిపోవడంతో ఢిల్లీలోని ఇంటిని మాములుగా అక్కడి అధికారులు స్వాదీనం చేసుకోవాలి.  ఆ ఇంటికి సంబంధించిన వ్య్వవహారాలు చూసుకుంటున్న అధికారులు ఈ విషయాన్ని జగన్ కు చెప్పడం... జగన్ ఆ ఇంటిని ఉపయోగించుకోవడానికి సరే అని చెప్పడంతో ఏపీ సీఎం జగన్ అధికారిక నివాసంగా ఆ ఇల్లు మారిపోయింది.  అలా చంద్రబాబు కలల ఇల్లు జగన్‌ వశమైంది. 


అధికారులు ఆ ఇంటిని జగన్ కు అనుకూలంగా మారుస్తున్నారాట. గతంలో బాబుకోసం పనిచేసిన వ్యక్తులు ఇప్పుడు ఢిల్లీలో జగన్ కోసం పనిచేస్తున్నారు.  జగన్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు.  కెరీర్లో ఎదగాలి అంటే.. ఎక్కడ ఎలా ఉండాలో ఎవరి దగ్గర ఎలా అణిగి ఉండాలో ఏ నాయకుల దగ్గర ఎలా ఉండాలో కొంతమంది అధికారులకు బాగా తెలుసు.  అలాంటి అధికారులు ఎక్కువ కాలం ఒకేచోట పనిచేస్తున్నారు.  తాము అనుకున్నది సాధించుకుంటుంటారు.  మరి జగన్ ఢిల్లీ వెళ్ళినపుడు అధికారిక నివాసంలో ఉంటారా లేదంటే ఏపీ భవన్ లోనే ఉంటారా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: