సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ వైసీపీ అధినేత జగన్ అంటే కస్సుమంటున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ అధికారంలో వున్న చంద్రబాబు కంటే విపక్ష నేతపైనే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. జగన్ ని క్రిమినల్ అంటూ పెద్ద మాటే అనేసిన రామక్రిష్ణ అయనపై ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. జగన్ కనుక సీఎం అయితే తప్పుడు పనులు చేసే వారిని దండించేదెవరంటూ లా పాయింట్ ఒకటి లాగారు. జగన్ తప్పుడు మనిషి అని, ఆయన ప్రభుత్వం కూడా అలగే వుంటుందని కూడా తేల్చేశారు.
కుర్చీ మీదే ప్రేమట !
జగన్ కి ఎంతసేపూ కుర్చీ మీదే ప్రేమంట. ఆయనకు జనాలపైనా, వారి సమస్యల పైనా ఏ మాత్రం ఆసక్తి లేదని రామక్రిష్ణ హాట్ హాట్
కామెంట్స్ చేశారు. ఏపీలో విపక్షం పూర్తిగా ఫైల్ అయిందని కూడా చెప్పేశారు. జగంతో ఎవరు కలసినా మునిగిపోతారంటూ వార్నింగులూ ఇచ్చేసారు.
పవన్ మా వైపే..!
ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ మా వైపే వున్నారని రామక్రిష్ణ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీతో జనసేన పొత్తు వుంటుందని వస్తున్న వార్తలు పుకార్లంటూ కొట్టిపారేశారు. అవే కనుక నిజమైతే జనసేనకు ఇంతే సంగతులంటూ జోస్యమూ చెప్పేశారు.
ఏపీలో కొత్త రాజకీయం !
ఏపీలో కొత్త రాజకీయం రాబోతోందని వూరించిన రామక్రిష్ణ అందులో జనసేన, వామపక్షాలు, ఆమాద్మీ పార్టీ, లోక్ సత్తా వుంటాయని చెప్పారు. సెప్టెంబర్ లో ఈ పార్టీలన్నీ కలసి అజెండా రెడీ చేస్తాయని ప్రకటించారు. మొత్తానికి బాబుని జస్ట్ అలా అన్నట్లుగా రెండు మాటలు అంటూ జగన్ పైనే గన్ ఎక్కుపెట్టిన ఈ వీర వామ పక్షవాది రూట్ ఎటువైపో పాలిట్రిక్స్ చూస్తున్న వారికి ఈ పాటికే అర్ధమయ్యే వుంటుం