
ఈ క్రమంలోని ఎవరి ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అదే సమయంలో ఇక ప్రస్తుతం టీమిండియా కు టీ20 ఫార్మాట్లో రెగ్యులర్ ఓనర్లుగా కొనసాగుతున్న రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ అందుబాటులో లేరు. ఈ క్రమంలోనే ఇక జట్టులో స్థానం దక్కించుకున్న శుభమన్ గిల్ ఓపెనర్ గా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అతనికి జోడిగా వచ్చే మరో ఆటగాడు ఎవరు అన్న విషయం పైకి మాత్రం గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయినా రిషబ్ పంత్ ను ఓపెనర్ గా పంపిస్తే బాగా రాణిస్తాడని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు.
టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ సైతం ఇక ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అన్న విషయం తెలిసిందే. కానీ టీమిండియా మాజీ ఆటగాడు కామెంటేటర్ ఆకాష్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. ప్రస్తుతం భారత జట్టుకు ఒక విధ్వంసక ఓపెనర్ అవసరం. అయితే పృథ్వి షా రూపంలో టీమిండియా కు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఆ ఆటగాడు పవర్ ప్లే లో జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించగలడు. కానీ ప్రస్తుతం అతడు ఫిట్టుగా లేడు. ఓపెనర్ గా పనికిరాడు అని కొంతమంది భావిస్తున్నారు. కానీ ఇలా మాట్లాడే వారు దేశవాళీ క్రికెట్లో ఓపెనర్ గా అతని రికార్డులు చూసి మాట్లాడాలి. అయితే ప్రతి మ్యాచ్ లోను చెలరేగుతాడని నేను చెప్పడం లేదు. బట్లర్, హేల్స్ లాంటి వారు కూడా ప్రతి మ్యాచ్లో దూకుడుగా ఆడలేరు. పృథ్వి షా లేకపోతే ఇషాన్ కిషన్ కు అవకాశం ఇవ్వండి అంటూ ఆకాశంలో చెప్పుకొచ్చాడు.