బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరు సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ కు సారధ్య బాధ్యతలు చేపట్టిన తక్కువ సమయంలోనే అందని ద్రాక్షలా ఉన్న ఐపిఎల్ టైటిల్ అందించాడు. ఇక ఆ తర్వాత వరుసగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అటు ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్ అందుకుంది అని చెప్పాలి. అయితే రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు టైటిల్ గెలిచి ఎవరికి సాధ్యం కానీ రికార్డు సాధించి  ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది.


 ఇలా ఐపీఎల్ టైటిల్స్ గెలిచాడు అనే కారణమో.. లేకపోతే ఇంకేదైనా ఉందో తెలియదు కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాను అంటూ ప్రకటించాడో లేదో రోహిత్ శర్మకు సారధ్య బాధ్యతలను నిర్మొహమాటంగా అప్పగించింది. రోహిత్ శర్మ కూడా తన కెప్టెన్సీ వ్యూహాలతో టి20 ఫార్మాట్లో వరుసగా విజయాలు అందించాడు. అయితే కోహ్లీ లాగా పూర్తిస్థాయిలో మాత్రం రోహిత్ జట్టుకు అందుబాటులో ఉండలేదు. అదే సమయంలో ఇక ద్వైపాక్షిక సిరీస్లలో కెప్టెన్సీ తో ఆకట్టుకున్న రోహిత్ శర్మ అటు ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్ని లలో మాత్రం చేతులెత్తేసాడు.


 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒక ఆటగాడిగా కెప్టెన్గా కూడా అతను పూర్తిగా విఫలం అవుతున్నాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందరూ రోహిత్ శర్మ కెప్టెన్సీ పై విమర్శలు గుప్పిస్తూ ఉంటే   ఏకంగా రోహిత్ శర్మ కెప్టెన్సీకి పదికి పదిమార్కులు ఇస్తున్నాను అంటూ యువరాజ్ చెప్పడం గమనార్హం. ఇక యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: