గత రాత్రి ఆస్ట్రేలియా మహిళలు మరియు ఇండియా మహిళల మధ్యన జరిగిన టీ 20 మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగిందో మనము చూశాము. మ్యాచ్ ఆద్యంతం విజయం నువ్వా నేనా అన్నట్టు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. ఇక చివరికి సూపర్ ఓవర్ పద్దతిలో ఇండియా మహిళలు అద్భుత విజయాన్ని అందుకున్నారు. ముంబైలో జరిగిన రెండవ టీ 20 లో మొదట టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా మహిళలు నిర్ణీత ఓవర్ లలో 187 పరుగులు చేశారు. మరోసారి బెత్ మూనీ (82) మరియు మెగ్రాత్ (70) లు చెలరేగి ఆడి ఆసిస్ కు మంచి టార్గెట్ ను అందించారు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మొత్తానికి కలిపి ఇండియా మహిళా బౌలర్లు సాధించింది కేవలం ఒకే ఒక్క వికెట్ కావడం విశేషం. బౌలర్లు అందరూ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు, ఇక 188 పరుగుల లక్ష్యంతో ఛేదన స్టార్ట్ చేసిన ఇండియా మహిళలు అద్భుతగా రాణించి చాలా ఈజీగానే గెలిచేలా అనిపించారు. కనేది ఒక దశలో వరుసగా హర్మన్ ప్రీత్ కౌర్, మందన్న మరియు దీప్తి శర్మలు అవుట్ కావడంతో ఇండియాకు ఆఖరి ఓవర్ కు 14 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ఫామ్ లో ఉన్న రిచా ఘోష్ తో పాటు కెరీర్ లో కేవలం రెండవ మ్యాచ్ ను మాత్రమే ఆడుతున్న 25 సంవత్సరాల దేవికా వైద్య ఉన్నారు.

మొదటి బంతిని రిచా సింగిల్ మాత్రమే తీసింది, అయితే దీనితో అందరూ ఇక ఆస్ట్రేలియా దే విజయం అనుకున్నారు. కానీ దేవికా తర్వాత బంతిని ఫోర్ గా తరలించి ఇండియా శిభిరంలో ఆశలు రేపింది. మూడవ బంతిని మళ్ళీ దేవికా సింగిల్ తీసింది, మూడు బంతులకు కేవలం పరుగులు మాత్రమే వచ్చాయి.. మరో మూడు బంతుల్లో ఎనిమిది పరుగులు చేయాల్సి ఉండగా నాలుగు మరియు ఐదవ బంతులకు మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. స్ట్రైకింగ్ లో దేవకా ఉంది, ఆఖరి బంతికి అయిదు పరుగులు చేస్తే ఇండియా విన్ అవుతుంది...లేదా ఫోర్ కొట్టినా డ్రా అవుతుంది. క్రీజులో యువ ప్లేయర్ దేవికా ఉంది.. మేగాన్ షూట్ సీనియర్ బౌలర్ బౌండరీ వెళ్లకుండా బంతిని వేస్తే చాలు ఆసిస్ విజయం పక్కా. కానీ అప్పుడే అద్భుతమైన యార్కర్ ను పాయింట్ దిశగా ఫోర్ గా మలిచింది దేవికా... అంతే ఒక్కసారిగా ఇండియా మహిళలు ఆనందంలో మునిగిపోయారు. అలా చివరికి ఇండియా మరియు ఆస్ట్రేలియా మహిళల టీ 20 డ్రా అయ్యి సూపర్ ఓవర్ లో ఇండియా విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: