ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఐపీఎల్ 2023 సీజన్ గురించి కళ్ళుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే అటు బీసీసీఐ కూడా వచ్చే ఏడాది ఐపీఎల్  సీజన్ ను మరింత ప్రణాళిక బద్ధంగా నిర్వహించి ప్రేక్షకులకు అదిరిపోయిన ఎంటర్టైన్మెంట్ అందించడమే లక్ష్యంగా అన్ని సన్నహాలను పూర్తి చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసాయ్. ఇక మరికొన్ని రోజుల్లో మినీ వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈ మినీ వేలం కోసం ఎంతోమంది భారత యువ ఆటగాళ్లతో పాటు ఇక విదేశీ క్రికెటర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 991 మంది ప్లేయర్లు ఇక మినీ వేలంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోగా ఇక మొత్తంగా ఈ జాబితాను షార్ట్ లిస్ట్ చేస్తే 405 మంది ప్లేయర్లు ఇక మినీ వేలంలో పాల్గొనబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఈ మినీ వేలంలో ఆయా ఫ్రాంచైజీలు ఎవరిని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.



 కాగా మినీ వేలం డిసెంబర్ 23వ తేదీన కొచ్చి వేదికగా జరగబోతుంది అని చెప్పాలి. ఇక ఈ వేళలో పాల్గొనే 405 మంది ప్లేయర్లలో 273 మంది భారతీయులు 132 మంది విదేశీయులు ఉన్నారు. అయితే ఇక ఈ వేలంలో పాల్గొనబోయే వారిలో ఎక్కువ వయసు ఉన్న ఆటగాళ్ళు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అవకాశాలు లేకపోయినప్పటికీ కొంతమంది సీనియర్ ప్లేయర్లు అటు ఐపీఎల్ లో ఆడి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు భారీ ధర పలుకుతూ ఉంటారు. కాగా మినీ వేలంలో పాల్గొనే ఆటగాళ్లలో అతి ఎక్కువ వయస్సు ఉన్న ప్లేయర్గా అమిత్ మిశ్రా ఉన్నాడు. అతని వయసు 40 ఏళ్ళ  15 రోజులు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl