గత కొంత కాలం నుంచి టీమ్ ఇండియా లో అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లు  అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నారు.  వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటూ ఇక తమ సత్తా ఏంటో చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమం లోనే రవీంద్ర జడేజా లేకపోవడం తో ప్రస్తుతం టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ బంతితో మాత్రమే కాదు బ్యాట్ తో కూడా అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయింది అని చెప్పాలి. అయితే వన్డే సిరీస్ గెలిచిన జోరుని కొనసాగిస్తుంది అనుకున్నప్పటికీ చివరికి ఓటమితో అభిమానులు అందరిని కూడా నిరాశపరిచింది. అయితే మొదటి టీ20 మ్యాచ్ లో అటు భారత జట్టు ఓడిపోయినప్పటికీ ఇక్కడ జట్టులో తన ప్రదర్శనతో హాట్ టాపిక్గా మారిపోయాడు వాషింగ్టన్ సుందర్. ఏకంగా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో తన బ్యాటింగ్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. ఏకంగా జట్టు కష్టాల్లో ఉన్న సమయం లో సూర్య కుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ టీమిండియా గెలుపు కోసం ఎంతగానో శ్రమించారు. అయితే వాషింగ్టన్ సుందర్ అయితే కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు అని చెప్పాలి. దీంతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా ఆరవ స్థానం లో బ్యాటింగ్ కు దిగి వేగంగా అర్థ సెంచరీ పూర్తి చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఈ క్రమం లోనే గతం లో సౌత్ ఆఫ్రికా పై ఆరవ స్థానం లో బ్యాటింగ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన దినేష్ కార్తీక్ రికార్డును బ్రేక్ చేశాడు వాషింగ్టన్ సుందర్. కాగా అతని ప్రదర్శన పై ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: