సాదరణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక ఆటగాడికి ఏదైనా ఫ్రాంచైజీ  భారీ ధర పట్టి కొనుగోలు చేసింది అంటే చాలు అతనిపై అటు అభిమానులు కూడా భారీగానే అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా భారీ ధర పెట్టి కొనుక్కుని ఆటగాడికి జట్టు కెప్టెన్సీ కూడా అప్పగిస్తే.. ఇక అతని ప్రదర్శన పై ఉండే అంచనాలు అంతా ఇంతా కాదు. ఒకవేళ అతను అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాడు అంటే చాలు తీవ్ర స్థాయిల విమర్శలు ఎదుర్కోవడం చూస్తూ ఉంటాం. స్టార్ క్రికెటర్ అయినప్పటికీ అతన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు ఎంతోమంది నేటిజన్లు.


 గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీ.. కొనసాగిన సమయంలో ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నారు అన్న విషయం తెలిసిందే. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించలేక.. ఇక కప్పును గెలిపించలేక ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుంది స్మృతి మందాన. ఆమె కెప్టెన్సీలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది బెంగళూరు జట్టు. కానీ ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది.


 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఇప్పటివరకు బెంగళూరు జట్టు ఏకంగా నాలుగు మ్యాచ్ లు ఆడింది. నాలుగింటిలో కూడా ఓటమి చవిచూడటం గమనార్హం. దీంతో బెంగుళూరు ప్రదర్శన పై ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ స్మృతి మందానను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు స్మృతి మందానాకు 3.4 కోట్లు పెట్టి తీసుకోవడం కూడా వేస్ట్ అంటూ విమర్శిస్తున్నారు. చెత్త కెప్టెన్ అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పాలి. మీ ఆటతో ఫాన్స్ నిరాశ పరుస్తున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: