
ఇదిలా ఉంటే.. గతంలో ఐపీఎల్ లో భాగమైన ప్లేయర్ల గురించి కూడా ఇక ఇప్పుడు చర్చ తెరమీదకి వస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే సురేష్ రైనా మళ్ళీ ఐపీఎల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడు అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. 15 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన సురేష్ రైనా.. మిస్టర్ ఐపిఎల్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున అయితే సురేష్ రైనాకు మరింత ఎక్కువ గుర్తింపు వచ్చింది. చెన్నై అభిమానులు అందరూ కూడా ధోనిని తలా అని సురేష్ రైనాను చిన్నతలా అని పిలుస్తూ ఉండేవారు అని చెప్పాలి.
ఇక అలాంటి సురేష్ రైనా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే మళ్లీ మీరు ఐపిఎల్ లోకి రీ ఎంట్రీ ఇస్తారా అన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించాడు. నేను సురేష్ రైనాని.. షాహిద్ ఆఫ్రిదిని కాదు.. రిటైర్ అయిపోతా అంటూ సురేష్ రైనా కామెంట్ చేశాడు. కాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పలుమార్లు మళ్ళీ రిటర్మెంట్ వెనక్కి తీసుకొని జట్టులోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి. అందుకే ఇక సురేష్ రైనా ఇలాంటి కామెంట్ చేసినట్లు తెలుస్తుంది.