
ఇలా ఒక్కో కల్చర్ వారు ఒక్కో రోజు న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఉదాహరణకు చైనీస్ ఫిబ్రవరి 5 న న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు. మన తెలుగు వారు మార్చిలో ఉగాదిని కొత్త సంవత్సరంగా వేడుకలు జరుపుకుంటారు. జనవరి 1 నాడు అనగా నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు ఎలా అయితే మన రోజు గడుస్తుందో అదేవిధంగా మిగిలిన సంవత్సరమంతా ఉంటుందని అందరూ నమ్ముతుంటారు. అందుకనే ఆరోజు వీలైనంత వరకు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. వాస్తవానికి ఇది ఒక నమ్మకం మాత్రమే ఖచ్చితంగా చెప్పలేం. న్యూ ఇయర్ నాడు సంవత్సరమంతా ఎన్నో విషయాలు దక్కాలని, సంతోషంగా ఉండాలని, ఎన్నో కోరుకుంటాము కానీ అంత ఆనందమే ఉండదు, అన్నింటా లాభాలే పండవు.
జీవితమంటేనే సుఖదుఃఖాల, లాభనష్టాల సమూహం. ఏ స్థితిలో మనం ఉన్న గుండె నిబ్బరం మన వెంటే ఉంటూ మనల్ని ముందుండి ఏడాది మొత్తం నడిపించాలని మనస్ఫూర్తిగాకోరుకుంటాం .. కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా అందరూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాలి. ఇక ఈ రోజు చేయవలసిన ఆచార వ్యవహారాలు విషయానికొస్తే... ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించడం, దేవుడికి శ్రద్ధతో పూజ చేసి పెద్దల ఆశీర్వాదం పొందాలి. వీలైనంత వరకు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి.