ప్రస్తుతం ఇంగ్లాండ్  జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టి-20 సిరీస్ ఆడుతుంది. టి 20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయాన్ని అందుకుంది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఇటీవలే రెండో టీ20 మ్యాచ్ లో మాత్రం దక్షిణాఫ్రికా జట్టు అనూహ్యంగా పుంజుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తొలి టీ-20 మ్యాచ్లో ఓటమిపై దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకుంది అనే చెప్పాలి. కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ప్రోటీస్ జట్టు 58 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ రిలీ రోసోవ్ 55 బంతుల్లో 92 పరుగులు చేసి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే జట్టు విజయంలో జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.


 కాగా అతనికి రీజా హెన్డ్రిక్స్ 32 బంతుల్లో 53 పరుగులతో మంచి సహకారం అందించాడు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు తరపున సీనియర్ ప్లేయర్ గా కొనసాగుతున్నారు రిలీ రోసోవ్. ఆరేళ్ల తర్వాత మళ్లీ సౌత్ ఆఫ్రికా తరఫున బరిలోకి దిగాడు అన్న విషయం తెలిసిందే. 2016 చివరిసారిగా దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన రిలీ రోసోవ్ 36 వన్డేలలో 1239 పరుగులు చేశాడు.ఇక 17 టి20 427 పరుగులు సాధించాడు. ఇక వీరిద్దరి ధాటికి ఇంగ్లాండ్ బౌలర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు అని చెప్పాలి. దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల చేసింది.


 ఇక ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ జట్టు చతికిలబడి పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 16.4 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌట్ అయింది ఇంగ్లాండ్ జట్టు. ఈ క్రమంలోనే 58 పరుగుల తేడాతో రెండో మ్యాచ్ లో విజయం సాధించినా దక్షిణాఫ్రికా మొదటి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది అని చెప్పాలి. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లలో   జానీ బెయిర్ స్టో 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే ఆరేళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన రిలీ రోసోవ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడటం పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: