
ఇలా గత సీజన్లో సాధించిన రికార్డులను తర్వాత సీజన్లో ప్లేయర్లు బద్దలు కుట్టడం ఎన్నోసార్లు జరిగింది. అయితే ఐపీఎల్ హిస్టరీలో ఇలా ఎన్నో రికార్డులు బద్దలు అయినప్పటికీ.. చాలా ఏళ్ల నుంచి కొన్ని రికార్డులు మాత్రం అలాగే పదిలంగా ఉండిపోయాయి అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే 2023 ఐపీఎల్ సీజన్లో కూడా ఇలాగే ఎంతోమంది ప్లేయర్లు విధ్వంసకరమైన ఆటతీరుతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. కానీ ఇక అంత మంచి ప్రదర్శన చేసిన ఇంకా కొన్ని రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేకపోయారు అని చెప్పాలి. మరి 2023 ఐపీఎల్ సీజన్లో ఇలా ప్లేయర్లు బద్దలు కొట్టలేకపోయిన రికార్డులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
2016 సీజన్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒకే సీజన్లో ఏకంగా 973 వ్యక్తిగత పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకు అత్యధికంగా కొనసాగుతుంది. ఈ రికార్డును ఎవరు ఇప్పటివరకు బ్రేక్ చేయలేదు. 2013 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక మ్యాచ్ 263 పరుగులు చేయగా.. ఇదే అత్యధిక స్కోరుగా ఉంది. ఇప్పటివరకు దీనిని ఎవరు బ్రేక్ చేయలేదు. 2013లో పూణేపై గేల్ చేసిన 175 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా ఉంది. దీనిని కూడా ఎవరు టచ్ చేయలేకపోయారు. 2013లో పూణే పై 30 బంతుల్లోనే గేల్ సెంచరీ చేశాడు. ఈ రికార్డు కూడా పదిలంగానే ఉంది. ఇక 2014లో కోల్కతా జట్టు వరుసగా పది మ్యాచ్లలో విజయం సాధించింది.ఈ రికార్డు కూడా ఎవరు బ్రేక్ చేయలేకపోయారు అని చెప్పాలి.