అయితే ఇప్పటికే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా టార్గెట్ చేదిస్తుందా లేదా అనే విషయంపై అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. అయితే టీమిండియా ఎంతో పట్టుదలతో పోరాడి తప్పక విజయం సాధించాలని మాత్రం అటు అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటూ ఉన్నారూ అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇదే విషయం గురించి టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
మంచిగా బ్యాటింగ్ చేస్తే 280 పరుగులు పెద్ద స్కోరేం కాదు అంటూ చెప్పుకొచ్చాడు మహమ్మద్ షమీ. సాధారణ టెస్ట్ మ్యాచ్ లాగా ఆడాలి. ప్రతి బంతిపై కూడా ఫోకస్ పెట్టాలి. నేను కూడా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటూ శమీ చెప్పుకొచ్చాడు. నేను మాత్రమే కాదు టీమిండియాలో ఉన్న ప్రతి ఒక్క ఆటగాడు కూడా బాగా బ్యాటింగ్ చేయగలడు. అందుకే మేము గెలుస్తామన్న నమ్మకం బలంగా ఉంది అంటూ మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు. ఇకపోతే టీమిండియా ఇప్పటికే రోహిత్, గిల్, పూజార లాంటి కీలకమైన వికెట్లు కోల్పోయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో అజింక్య రహనే, విరాట్ కోహ్లీ లు ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి