సాధారణంగా ఇంటి భోజనం తిని తిని బోర్ కొట్టినప్పుడు.. సరదాగా ఇక దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వెళ్లి తమకు ఇష్టమైన ఆహారం ఆర్డర్ చేసుకొని తినాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతుంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో అయితే కొంతమంది ఏకంగా ఇంటి భోజనం తినడం మానేసి.. ప్రతిరోజు బయట ఆహారం తినడానికి అలవాటు పడిపోతున్నారు. అయితే ఇలా ఎవరైనా రెస్టారెంట్ కు వెళ్లి తినాలి అనుకున్నవారు హోటల్ కు వెళ్ళిన తర్వాత ఎక్కువగా ఆర్డర్  చేసే ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది పులావ్ అని చెప్పాలి.


 రెస్టారెంట్లలో ఎన్నో రకాల పులావ్ లు అందుబాటులో ఉంటాయి  ఈ క్రమంలోనే ఇక ఇలా పులావ్ ఆర్డర్ చేసి తినడానికి ఆహార ప్రియులందరూ కూడా ఎంతగానో ఇష్టపడిపోతూ ఉంటారు. అందుకే ఇక ఏ రెస్టారెంట్లో చూసిన పులావ్ కి మంచి డిమాండ్ ఉంటుంది అని చెప్పాలి. అది సరే కానీ ఇప్పుడు పులావ్ గురించి అంత ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోబోయే పులావ్ ఎంతో స్పెషల్. ఎందుకంటే ఈ పులావ్ తిన్నారు అంటే వయాగ్రా వాడినంత ప్రభావితం చూపిస్తుందట.


 ఇలా ప్రపంచంలో ప్రస్తుతం ఎన్నో రకాల పులావ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వుజ్బేకిస్తాన్ లో ఉండే పులావ్ కి మాత్రం ఎంతో ప్రత్యేకత ఉందట. ఎందుకంటే ఇది ఏకంగా వయాగ్రాలాగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఆ దేశ జాతీయ వంటకం గుర్తింపును సంపాదించుకుంది ఈ పులావ్. ఈవెంట్ ఏదైనా సరే ఆ ఈవెంట్లో ఈ వంటకం ఉండాల్సిందే. దీని యునెస్కో కూడా గుర్తించింది. ఇందులో పురుషుల్లో వీర్యాన్ని వృద్ధి చేసే లక్షణాలు ఉన్నాయని వయాగ్రా తో ఇది సమానం అని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. జీవితంలో కేవలం ఒకేరోజు బ్రతికి ఉంటాం అని తెలిస్తే ఇక ఒక్కసారైనా ఈ పులావ్ తినాలని అక్కడ జనాలు కోరుకుంటూ ఉంటారట. అంతలా ఈ పులావ్ కు క్రేజీ ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: