ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చింది అంటే ఇండియన్ క్రికెట్ అభిమానులకు ఎక్కడలేని సంతోషం వస్తూ ఉంటుంది. దాదాపు నెల కంటే ఎక్కువ రోజుల పాటు సాగే ఈ టోర్నీ ఇండియా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని నింపుతూ ఉంటుంది. రోజు ఎప్పుడు సాయంత్రం అవుతుందా .? ఇప్పుడు మ్యాచ్లు చూద్దామా అని ప్రేక్షకులు తహతలాడుతూ ఉంటారు. మ్యాచ్లలో భారీ స్కోరులు వస్తే ప్రేక్షకులకు ఎక్కడలేని ఎంజాయ్మెంట్ వస్తూ ఉంటుంది. కానీ (ఐపిఎల్) టోర్నీలలో కొన్ని మ్యాచ్ లలో మాత్రమే ఎక్కువ స్కోరు లు నమోదు అవుతూ ఉంటాయి.

కానీ ఈ సారి మాత్రం జరిగిన 16 మ్యాచుల్లోనే ఇప్పటి వరకు అనేక టీం లు భారీ స్కోరు పను సాధించాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు జరిగిన ఏ (ఐపిఎల్) సీజన్ లో జరగని ఒక రేర్ విషయం ఈ (ఐపీఎల్) సీజన్ లో జరిగింది. ఇప్పటివరకు జరిగిన ఏ (ఐపిఎల్) లో కూడా ఒకే సీజన్ లో 250 కంటే ఎక్కువ పరుగులు రెండు సార్లు రాలేదు. కానీ కేవలం గడిచిన 16 మ్యాచుల్లోనే 250 పరుగులకు మించిన ఇన్నింగ్స్ లు రెండు వచ్చాయి. మొదటగా సన్రైజర్స్ ... ముంబై మధ్య జరిగిన మ్యాచ్ లో కేవలం సన్రైజర్స్ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 277 పరుగులను సాధించింది.

ఇది ఇప్పటివరకు (ఐపీఎల్) హిస్టరీ లోనే హైయెస్ట్ స్కోర్. ఇకపోతే నిన్న కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ మధ్య విశాఖపట్నం లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్ లలో ఏడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఇలా కేవలం ఒకే సీజన్ లో 250 కంటే ఎక్కువ పరుగులు కలిగిన రెండు ఇన్నింగ్స్ లు ఈ సీజన్ లో వచ్చాయి. మరి ఈ సీజన్ లో ఇంకా చాలా మ్యాచులు మిగిలి ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఇన్నింగ్స్ లో కూడా ఈ తరహాలా ఉంటే బాగుంటుంది అని (ఐపీఎల్) అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl