ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ విరాట్ కోహ్లీ అరెస్ట్ చేయండి అనే.  ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 18 ఏళ్లుగా ట్రోఫీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంతో ఎంతో వెయిట్ చేసింది .కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసింది . ఫైనల్లీ ఆ స్పెషల్ మూమెంట్ రానే వచ్చింది అని ఆనందపడే లోపే ఆ ఆనందం మొత్తం నీరుగారిపోయింది . 18 ఏళ్లుగా మెగా ట్రోఫీని ముద్దాడాలని ఎదురుచూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కి ఇప్పుడు ఊహించని కొత్త సమస్య ఎదురయింది.


మనకు తెలిసిందే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఎంత ఘోరంగా జరిగిందో. 11 మంది మృతి చెందారు . 35 మందికి పైగా తీవ్రంగా గాయాలు పాలయ్యారు.  ఈ ఇష్యూ ని కర్ణాటక గవర్నమెంట్ చాలా చాలా సీరియస్ గా తీసుకుంది . అసలు ఈ ఘటన ఎలా జరిగింది..? ఈ ఘటనకి బాధ్యులు  ఎవరు..? అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా సిబ్బంది ఉన్నారు ..? అన్నదానిపై స్పెషల్ టీం ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది . అయితే అసలు ఇంత జనాభా ఇక్కడికి రావడానికి కారణం కేవలం కోహ్లీ అని.. మెగా ట్రోఫీని చూడడానికన్నా కూడా కోహ్లీ ని చూడడానికి జనాలు ఈ రేంజ్ లో ఎగబడ్డారు అని కోహ్లీ కారణంగానే ఇక్కడ ఇంత జరిగింది అని కొంతమంది నెటిజన్స్ ఘాటుగా విమర్శిస్తున్నారు .అంతేకాదు సోషల్ మీడియాలో ఆయనను అరెస్ట్ చేయాలని హ్యాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు .



 అయితే ఇందులో కోహ్లీ తప్పేముంది..?   జనాలు  ఏందుకు ఆయనని అరెస్ట్ చేయాలని మాట్లాడుతున్నారు ..?అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అయితే ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దర్యాప్తు కోసం కమిటీని  నియమించారు . విరాట్ కోహ్లీకి రైట్ హ్యాండ్ గా ఉన్న ఆర్ సి బీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ ని అరెస్ట్ చేశారు . అంతేకాదు రాయల్ చాలెంజర్స్ జట్టు ప్రతినిధులు ..కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు.. ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలి అంటూ సీఎం ఆదేశించిన్నట్లు తెలుస్తుంది. మరొకవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్ ..ట్రెజరర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది . ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.  దానితోపాటు సీఎం సిద్ధరామయ్య డిజిపి కి కిలక ఆదేశాలు జారీ చేశారు .

 

అయితే ఇంతటి విషాదం చోటు చేసుకున్న కోహ్లీకి ఏం పట్టి పట్టన్నట్లు ఉన్నాడు అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు జనాలు. ఇలాంటి మూమెంట్లోనే కోహ్లీకి సంబంధించిన కొన్ని ఫేక్ వీడియో కూడా వైరల్ అవుతున్నాయి. భార్యాబిడ్డలతో కలిసి లండన్ వెళ్తున్నాడు అంటూ వీడియో వైరల్ గా మారింది. అసలు విరాట్ కి మానవత్వం లేదు అని .. ఇంతమంది చనిపోతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మనసు ఎలా వచ్చింది..? అంతూ ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు అసలు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు . కొంతమంది ఆయన వెంటనే అరెస్ట్ చేయండి అంటూ కర్ణాటక గవర్నమెంట్ కి సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ కోహ్లీ అభిమానులు మాత్రం దీని పట్ల నెగిటివ్గా స్పందిస్తున్నారు. కోహ్లీ అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కోహ్లీని అరెస్ట్ చేస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో కూడా అందరికీ తెలిసిందే..!?

మరింత సమాచారం తెలుసుకోండి: