ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకుంటున్నారు. అలా ఉపయోగించుకుంటున్న వాటిలో ఫేస్ బుక్ తర్వాత వాట్సప్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ వాట్స్అప్ ద్వారా మనం అనేక సమాచారాలను సైతం పంపించుకునే సదుపాయం కలదు. మెటా సంస్థకు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సప్ సరికొత్త ఫ్యూచర్లను తమ కస్టమర్ల కోసం తీసుకువస్తూనే ఉన్నది. ఇప్పటిలాగా కాకుండా ఇక మీదట నుంచి వాట్సప్ ఓపెన్ చేయాలి అంటే కచ్చితంగా స్క్రీన్ లాక్ తీయాల్సిందేనని ఆ సంస్థ తాజాగా తెలియజేయడం జరుగుతోంది.


స్క్రీన్ అనే పేరుతో తీసుకు వస్తున్న ఈ ఫీచర్ తో డెస్క్ టాప్ లో యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా పాస్వర్డ్ ని తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సిందేనట. ఇకమీదట యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ ఫీచర్లను తీసుకురాబోతున్నట్లుగా మెటా సంస్థ తెలియజేయడం జరిగింది. ఇలాంటి కొత్త ఫీచర్ల వల్ల అదనపు భద్రత లభిస్తుందని ఆ సంస్థ తెలియజేస్తోంది. ముఖ్యంగా తమ పర్సనల్ విషయాలను సైతం ఎవరు ఓపెన్ చేయకుండా ఉండేందుకు మరింత సహాయపడుతుందని చెప్పవచ్చు. అయితే ఈ ఫీచర్ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని తెలియజేస్తోంది. ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉందని తెలియజేస్తున్నారు.

టెస్టింగ్ పూర్తి అయిన వెంటనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు. నంబర్ లేదంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ భద్రతతో లాక్ తీసుకోవచ్చట.  ఒకవేళ యూజర్స్ పాస్వర్డ్ మర్చిపోతే యాప్ నుంచి లాగౌట్ చేసి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వచ్చని తెలియజేశారు. ఇప్పటివరకు ఒక్కసారి డేస్క్ టాప్ లో లాగిన్ అయితే చాలు మళ్ళీ లాగౌడ్ కొట్టేంతవరకు వాట్సాప్ ను ఉపయోగించుకోవచ్చు.. ఒకవేళ లాగౌట్ యూజర్స్ మర్చిపోతే వారి ప్రైవసీకి ప్రమాదం ఉంటుందని వాట్సప్ సంస్థ పలు వాదనలు విన్న తర్వాత వాటిని చెక్పెట్టే విధంగా ఈ కొత్త ఫ్యూచర్ ని తీసుకొస్తున్నట్లు తాజాగా ఒక ప్రకటనలో తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: