సాధారణంగా రెమ్యూనరేషన్ అంటే సినీ ఇండస్ట్రీలోని నటీనటులకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీరి రెమ్యూనరేషన్ కోట్ల రూపాయలలో ఉంటుంది కనుక.. అలాగే బుల్లితెర పైన కనిపించే నటీనటులు సైతం కోట్లల్లో కాకుండా లక్షలలో తీసుకునేవారు ఉన్నారు.. ముఖ్యంగా బుల్లితెర పైన నటీనటుల రెమ్యూనరేషన్ చాలా తక్కువగానే ఉంటుంది అలాంటి వారిలో కూడా అత్యధికంగా పారితోషకం అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఒక్కో ఎపిసోడ్ కి లక్ష రూపాయల వరకు కూడా వసూలు చేసి క్రేజీ నటీనటులు కూడా ఉన్నారు.

7 సంవత్సరాల వయసులోనే చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించి ప్రస్తుతం బుల్లితెర పైనే అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటిగా పేరు సంపాదించింది నటి రూపాలి గంగోలి. పలు సీరియల్స్ లో నటిస్తూ ఒక్కో ఎపిసోడ్కి అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటోంది .దాదాపుగా 22 ఏళ్ల పాటు ఇండస్ట్రీలోని కొనసాగుతోంది.. ఈమె ఎవరో కాదు ప్రముఖ రైటర్ అనిల్ గంగూలీ కుమార్తెగా బుల్లితెర పైన అడుగు పెట్టింది.. 1985 లో ఏడేళ్ల వయసులోనే తన తండ్రి చిత్రీకరించిన సాహెబ్ అనే చిత్రంలో నటించింది.


ఆ తర్వాత 2000 సంవత్సరంలో పలు సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. 2006లో బిగ్ బాస్ సీజన్ -1 లో ప్రవేశించింది రూపాలి గంగోలి.. బాలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అక్షయ్ కుమార్ కుటుంబంతో ఈమెకు మంచి రిలేషన్ ఉన్నది సీరియల్స్ లో నటిస్తుండగానే రూపాలి ఒక ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ కే వర్మాను వివాహం చేసుకోవడం జరిగింది.. అలా వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఈమె పలు సీరియల్స్ లో నటిస్తూ ఇండియాలోని అత్యంత ప్రజాదారణ పొందిన బుల్లితెర నటిగా పేరు సంపాదించింది. ప్రస్తుతం ఈమె ఒక్కో ఎపిసోడ్ కి రూ .3లక్షల రూపాయలు అందుకుంటోందట. దాదాపుగా సీరియల్ వల్లే 30 కోట్ల వరకు సంపాదించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: