ప్రముఖ టు వీలర్ వాహన సంస్థ తయారీలలో బజాజ్ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... యూత్ ఎక్కువగా ఇష్టపడేటువంటి పల్సర్ బైక్ మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నది.. అందుకే ఎన్నో రకాల మోడల్స్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది బజాజ్ సంస్థ.. ఇప్పుడు తాజాగా మొట్టమొదటి సీఎన్జీ బైకులు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది.. వచ్చె ఏడాది ఈ బైక్ ను విడుదల చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎండి రాజీవ్ బజాజ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు..


Cng మోటర్ బైక్.. ఇంధన ధర నిర్వహణ ఖర్చు 60 శాతం మేరకు తగ్గుతుందంటూ వెల్లడించారు. దేశంలోని అతిపెద్ద బైక్ సంస్థల బజాజ్ ఆటో ఉందని మొట్ట మొదటిసారిగా ఇలాంటి బైక్ ని లాంచ్ చేసేందుకు ఏర్పాటు జరుగుతున్నాయని వెల్లడించారు.. 2025 ఆర్థిక ఏడాదిలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు ఈ బైక్స్ అటు పెట్రోల్ తో పాటు సిఎన్జి పైన కూడా నడుస్తుంది అంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఎక్కువగా సీఎన్జీ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. ఇందులో దాదాపుగా అన్నీ కూడా ice ఇంజన్ మోడల్స్ కి సీఎన్జీ టచ్ ఇచ్చినవి అంటూ వెల్లడించారు..


కానీ మార్కెట్లోకి మాత్రం వరుసగా సిఎన్జి బైక్లను తయారు చేసి విడుదల చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలియజేశారు. ఫ్యూయల్ ఖర్చులు తగ్గేందుకు ప్రయత్నించే కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని cng బైకులను తీసుకువస్తున్నట్లు తెలియజేశారు..  పల్సర్ ఇతర బ్రాండ్ మోటార్ సైకిల్ లను 90 కంటే ఎక్కువ దేశాలలో ఎగుమతి చేస్తున్నారని తెలిపారు.. చేతక్ కంపెనీ 2020 ఎలక్ట్రిక్ వెహికల్స్ తో మళ్ళీ తిరిగి ప్రవేశించారు సిఎన్జి అనేది ఒక పర్యావరణహితమైనది. ఇందుకు ఖర్చు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది సిఎన్జి తో నడిపే వాహనాలు ముడి దిగుమతులను తగ్గించే విధంగా ప్రభుత్వాలు కూడా అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్, cng బైక్స్ హావనే నడుస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: