సాధారణంగా వివాహం అనేది అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి మరీ అటు అబ్బాయి అయినా ఇటు అమ్మాయిని వివాహం చేసుకోవడం జరుగుతుంది.. అప్పట్లో అయితే పెళ్లిళ్లు చాలా డిఫరెంట్ గా జరిగేవి.. ఎందుకంటే తల్లిదండ్రులు చూసిన సంబంధానికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓకే చెప్పేవారు.. అంతే కాదు మరి కొంతమంది అయితే ఏకంగా పెళ్లి పీటల మీద తమ జీవిత భాగస్వామిని చూసేవారు.. ప్రస్తుతం పరిస్థితి మారింది.. కాలం మారుతున్న కొద్ది మనుషుల లో కూడా మార్పులు సంభవిస్తున్నాయి.. ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇక పెద్దలు కుదిర్చిన సంబంధాలు అయినా సరే వివాహం జరగడానికి ఎంతలేదన్నా నెల రెండు నెలల సమయం కూడా వస్తోంది.

ఈ నేపథ్యంలో ని కాబోయే దంపతులు కొన్ని రోజులు కలిసి ఒకరినొకరు తెలుసుకోవడానికి, ట్రావెల్ చేసే సమయం కూడా లభిస్తోంది.. అయితే ఈ జర్నీలో మీరు ఎదుటి వ్యక్తి గురించి అర్థం చేసుకుని వారు ఎలాంటి వారు అనే విషయాలను కూడా తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది.. ముఖ్యంగా వారి అలవాట్లను ,మాట తీరును, లక్షణాలను కూడా గమనించవచ్చు.. తద్వారా మీరు ఆ వ్యక్తిని మీ జీవిత భాగస్వామి చేసుకోవచ్చు.. లేదో తెలుసుకోవడానికి సులభంగా ఉంటుంది.. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని లక్షణాలు కలిగిన వ్యక్తిని మీరు వివాహం చేసుకోకపోవడమే మంచిది అని చెబుతున్నారు మానసిక నిపుణులు..

స్వార్థపరులు:
ఎప్పుడు నేను ,నాది, నాకు మాత్రమే సొంతం అని ఆలోచిస్తూ ఉంటారు.. వీరిద్దరి నుంచి నాకు, నేను అన్న పదమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.. అంతేకాదు ఈ ప్రపంచంలో తామే అన్నిటికీ కేంద్ర బిందువులు అని ఫీల్ అవుతూ ఉంటారు..  ప్రతి ఒక్కరూ తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.. కాబట్టి వీళ్ళతో వేగడం చాలా కష్టం.

మూలిగే మనిషి ఇక అసలే వద్దు:
ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధ పడుతు, మూలుగుతూనే ఉంటారు.. వారు చేసిన తప్పులను కూడా ఇతరుల మీద పెట్టి బాధపడిపోతుంటారు.. అయితే వీరిని భరించడం చాలా కష్టం.

హిపో క్రైట్స్:
ఇలాంటి వ్యక్తులు చెప్పేది ఒకటైతే.. చేసేది మరొకటి అవుతుంది.. అంతేకాదు వీరు మాటలు చాలా స్పూర్తిగా అందంగా కనిపిస్తాయి.. కానీ వీరు చేసే పనులు మాత్రం ప్రతి ఒక్కరికీ చికాకును తెప్పిస్తాయి. ముఖ్యంగా వీరు చేసే పనిని సమర్థించుకుంటూ, అదే ఆ పనిని ఎదుటి వారు చేసే తప్పులు వెతుకుతూ ఉంటారు.. ఇలాంటి మోసకారి వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది..

అబద్దాలు ఆడేవారినీ, జీవితంలో అస్పష్టత గా ఉండే వాళ్ళని వివాహం చేసుకోకపోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: