ఒకప్పటిలా నేటి రోజుల్లో అడవుల్లో ఎక్కువగా కోతులకు ఆహారం దొరకడం లేదు. వెరసి ఇక కోతులు గుంపులుగా ఏకంగా రహదారుల పైకి వస్తూ ఉన్నాయి. ఎవరైనా గొప్ప మనసు చేసుకొని తమకు ఆహారం పెడతారేమో అని దీనంగా ఎదురు చూస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది కోతుల కడుపు నింపేందుకు ఆహారం పెట్టినప్పటికీ చివరికి రోడ్డుమీద ఈ ఆహారం పడేస్తూ ఉండడంతో ఇక ఎన్నో కోతులు రహదారుల పైకి వచ్చి వాహనాల కింద పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే.


 ఇలా ఇటీవల కాలంలో రోడ్లపైకి వచ్చి వాహనాల కింద పడి ప్రాణాలు కోల్పోతున్న కోతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇలా కోతులు చనిపోతున్న సమయంలో ఎప్పుడు తల్లి చంకనే ఉండే చిన్న వానరాలు విగతా జీవిగా పడి ఉన్న తల్లి దగ్గరే దీనంగా చూస్తూ ఉన్న వీడియోలు ఎంతోమంది మనస్సును పిండేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా మెలిపెట్టేస్తూ ఉంది.



 ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ అయినా సుశాంత నందా ట్విట్టర్ వేదికగా ఈ వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో చూసుకుంటే ఒక వానరం వాహనం కిందపడి చివరికి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. అయితే చనిపోయిన తల్లిని చుట్టుకొని బుల్లి వానరం ఏడుస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఈ వీడియో ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది. తన తల్లికి ఏమైందో కూడా తెలియని చిన్న వానరం అమ్మ ఒకసారి పైకి లేవు అంటూ చివరికి కన్నీరు మున్నీరవుతుంది అని చెప్పాలి. అస్సోంలో రోడ్డుపై వేగంగా వెళుతున్న వాహనం ఢీకొనడంతో తల్లి వానరం మరణించింది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: