
అందులో ఒకటి భూమి మీద తిరిగి అతి పెద్ద క్షీరదం అయిన ఏనుగు. ఏనుగు ఎంత పెద్ద శరీరంతో ఎక్కువ కాలం జీవిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే ఏనుగులకు క్యాన్సర్ రాదు..ఎందుకు..? అనేది శాస్త్రవేత్తలను ఎప్పటినుంచో ఆకర్షిస్తున్న ప్రశ్న. దీనికి కారణం ఒక ప్రత్యేక జన్యువే . సాధారణంగా మిగతా ఏ జంతువులలోనైనా క్యాన్సర్ కనిపిస్తుంది. కానీ ఏనుగులలో మాత్రం క్యాన్సర్ కనిపించదు. దానికి కారణం P53 అనే జెన్యూవ్ అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు . సాధారణంగా P 53 జన్యున్ మానవుల్లో ఒక కాపీ మాత్రమే ఉంటుంది .
అయితే ఇది క్యాన్సర్ కణాలను పెరుగుదలను అడ్డుకుంటుంది. అయితే ఏనుగులల్లో ఈ P53 షెడ్యూల్ కాపీలు ఏకంగా 20 వరకు ఉంటాయట . ఇదే విషయం తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు . ఆ కారణంగానే క్యాన్సర్ రాకుండా ఈ P53 ఏనుగులను కాపాడుతూ వస్తుందట. ఒకవేళ డిఎన్ఎ దెబ్బతిన్నప్పుడు కణ విభజనను వెంటనే ఈP53 జెన్యూన్ ఆపేస్తాయట . క్యాన్సర్ కణాలను పెరగకుండా నియంతరిస్తాయట . మానవులలో ఈ జెన్యూ ఒక కాపీ మాత్రమే ఉండడం వల్ల కొన్నిసార్లు దెబ్బతిన్న కణాల మీద నియంత్రించలేకపోవచ్చు ..కానీ ఏనుగులో మాత్రం ఇది దాదాపు 20 కాపీలు కలిసికట్టుగా పనిచేస్తాయని .. ఆ కారణంగానే ఏనుగులకు క్యాన్సర్ రాదు అని చెబుతున్నారు సైంటిస్టులు..!