
ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య కొనసాగుతున్న వార్ ఇప్పటికే హద్దులు దాటేస్తుంది . వార్ ఉగ్రరూపం దాల్చుతుంది . ఈ కారణంగా ఇప్పటికే చమురు మార్కెట్ ను బాగా దెబ్బతీసింది. ముడి చమురు ధరలు 11 శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 11 శాతం పైగా పెరిగి బ్యారెల్‌కు 75.32 డాలర్లను తాకింది. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 73.42 డాలర్లకు అమాంతం చేరిపోయింది . ఇదే విధంగా యుద్ధం కొనసాగితే, చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు.
నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయిల్ దేశంతో ట్రేట్ మరింత వేగం పెంచుకుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు - హైటెక్ యంత్రాలు - కమ్యూనికేషన్ వ్యవస్థలతో ట్రేడింగ్ బాగా పెరిగింది. ఇరాన్ నుంచి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ కూడా వస్తూ ఉంటాయి . ఈ యుద్ధం కారణంగా డ్రై ఫ్రూట్స్ రావడం ఆగిపోయింది. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ రేట్లు డబల్ ట్రిపుల్ పెట్టి అమ్మేస్తున్నారు అంటూ జనాలు మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా సరఫరా తగ్గిపోవడంతో డ్రై ఫ్రూట్స్ రేట్లు భారీగా పెరిగిపోయాయి .
ఇలాగే ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య వార్ కొనసాగితే డ్రై ఫ్రూట్స్ పూర్తిగా సరఫర ఆగిపోతుంది అని .. అసలు ఇండియాలో ఇక ఎండుద్రాక్ష ..పిస్త.. ఆప్రికాట్ చూడలేమంటున్నారు నిపుణులు. అందుకే చాలామంది ముందు జాగ్రత్తలో ముందుగా కొని పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే సూపర్ మార్కెట్స్ లో డ్రైఫ్రూట్స్ కొనుక్కొని జాగ్రత్తపరుచుకుంటున్నారు కొంతమంది జనాలు. దీంతో వీటి అమ్మకాలు బాగా పెరిగిపోయాయి.
ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు దిగుమతులు చేసుకుంటున్న ప్రాడెక్ట్స్:
*ఎలక్ట్రానిక్ పరికరాలు
*ఆయుధాలు
*ఆప్టికల్, ఫొటోగ్రఫిక్, టెక్నికల్, మెడికల్ పరికరాలు
*ఎరువులు
*యంత్రాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు
*అల్యూమినియం, వివిధ రసాయన ఉత్పత్తులు
*ముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలు, నాణేలు
ఆర్గానిక్ రసాయనాలు
ఇరాన్ నుంచి భారత్‌కు దిగుమతులు చేసుకుంటున్న ప్రాడెక్ట్స్:
* ఆర్గానిక్ కెమికల్స్
* పండ్లు, గింజలు
*ముడి చమురు, ఇంధన పదార్థాలు
* ఉప్పు, గంధకం, భూమి ఖనిజాలు, సిమెంట్
*ప్లాస్టిక్ పదార్థాలు
ఈ యుద్ధం మరింత పెరిగితే.. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎరువులు, చమురు, రసాయనాలు, ప్లాస్టిక్ సామాగ్రి, ఇంధనాలు, అల్యూమినియం వంటి ఉత్పత్తుల ధరలపై ప్రభావం తప్పదని భావిస్తున్నారు నిపుణూలు.దీనికి తోడు మధ్యలో ట్రంప్ కూడా వేలు పెట్టాడు ఇంకా వార్ ముదిరిపోయింది..!