
ఈ బుల్లి చేపకు శాస్త్రవేత్తలు `పెథియా డిబ్రుగర్హెన్సిస్` అని నామకరణం చేసేశారు. ఈ జాతి చేప సైప్రినిడ్ కుటుంబానికి చెందినది. ఈ చేప యొక్క అత్యంత ప్రత్యేక లక్షణాల్లో ఒకటి అసంపూర్ణమైన పార్శ్వ రేఖ(లేటరల్ లైన్). షార్క్, డాల్ఫిన్, ఆక్టోపస్ వంటి శత్రుజలచరాలు కదిలితే నీటి తరంగాలతో వాటి కదలికను కనిపెట్టి అప్రమత్తం చేసే ఇంద్రియ అవయవం ఇది. ఈ ఇంద్రియ అవయవం అసంపూర్ణంగా అభివృద్ధి చెందడం వల్ల ఇతర జీవులు ఈ చేపను వేటాడటం చాలా సులభం.
తోక భాగానికి సమీపంలో పెద్ద నల్ల మచ్చ ఈ చేప ప్రత్యేకత. తోక ప్రాంతం చుట్టూ 10 పొలుసులు మరియు శరీరంపై నిర్దిష్ట పొలుసుల నమూనాలు ఉన్నాయి. పైభాగంలోని రెక్కకు, లేటరల్ లైన్ కు మధ్యలో 4 పొలుసుల వరసలు, అదేవిధంగా కింది రెక్కకు, లేటరల్ లైన్ కు మధ్యలో మరో నాలుగు పొలుసుల వరసలు క్రమ పద్ధతిలో ఉన్నాయి. అలాగే అనేక ఇతర జాతుల్లో కనిపించే నోటి దగ్గర మీసాల లాంటి నిర్మాణాలు మరియు హ్యూమరల్ మార్క్ ఈ చేపకు కనిపించదు. కాగా, ఈ కొత్త జాతి చేప బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ యొక్క పర్యావరణ గొప్పతనాన్ని మరియు దానిని పరిరక్షించాల్సిన తక్షణ అవసరాన్ని హైలైట్ చేస్తుందని పరిశోధకులు అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు