ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పుడో ఒకసారి చూసే ఉంటాం. దిష్టి పోవాలంటే గుమ్మానికి మూడు నిమ్మకాయలను దారానికి గుచ్చి కట్టాలి. ఆ నిమ్మకాయలను పసుపు–కుంకుమలతో పూజించాలి. లేకపోతే, శుక్రవారం నిమ్మకాయను కట్ చేసి గడపకు రెండు పక్కల పసుపు–కుంకుమ రాసి పెట్టాలి. అలా చేస్తే ఆ ఇంటిపై ఎవరికైనా నరదిష్టి ఉంటే అది పోతుందనే నమ్మకం ఉంది. చాల మంది పెద్దలూ ఇలాగే “దిష్టి తీయాలి” అని సూచిస్తారు. కొందరి ఇంటికి దిష్టి తగిలి, దాని కారణంగా బాధపడుతున్నారు అంటే వెంటనే గుర్తు వచ్చేది ఈ నిమ్మకాయలే. చాలా మంది నిమ్మకాయలు, మిరపకాయలు వాడి దిష్టి తొలగించాలి అని చెబుతారు. మన ఇళ్లలో చాలామంది పెద్దలు, మహిళలు  ఈ పద్ధతిని పాటిస్తున్నారు.


అయితే చాలామందికి ఒక సందేహం ఉంది. దిష్టికి నిమ్మకాయ ఎందుకు ఎక్కువగా వాడుతారు? ఇతర వస్తువులు ఎందుకు ఎక్కువగా వాడరు? నిజానికి నిమ్మకాయలకు దిష్టితో ఏ సంబంధం ఉంది? నిమ్మకాయ తీస్తేనే దిష్టి పోతుందా? టమాటా లేదా ఇతర ఫలాలతో దిష్టి తీయలేమా? అని రకరకాలుగా కూడా ప్ర్శ్నిస్తూ ఉంటారు. నిమ్మకాయతో దిష్టి తీస్తేనే దిష్టి పోతుందా అంటే, జవాబు లేదు. రకరకాల పద్ధతులు ఉన్నాయి. కొందరు నిమ్మకాయ, కొందరు ఎండుమిరప, మరికొందరు ఆవు పేడ, కొందరు ఉప్పు, మరికొందరు కొబ్బరికాయ, కొందరు గుమ్మడికాయ, కొందరు కోడిగుడ్డు ఇలా వాడి దిష్టి తీస్తారు.



ఎందుకు నిమ్మకాయ ఎక్కువగా వాడుతారు అంటే, అది చీప్ కావడం కారణంగా. మనం గమనిస్తే, ఎవరూ వెండి, బంగారం లేదా కరెన్సీ నోట్లతో దిష్టి తీయరు . అలా చేయరు, ఎందుకంటే అవి ఖరీదైనవిగా ఉంటాయి. దిష్టి తీయడం అంటే మనుషులో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు బయటపడించడం. అందుకు ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే వస్తువులను వాడతారు. ఇందులో ముందుగా నిమ్మకాయ, ఆ తర్వాత ఉప్పు, ఆవు పేడ, పసుపు, కర్పూరం, కొబ్బరికాయ మొదలైనవి వాడతారు. నిమ్మకాయతో దిష్టి తీస్తే దిష్టి పోతుందని జనాలకి నమ్మకం ఉంది.  ఇది నెగటివ్ ఎనర్జీ లాగే శక్తి కలిగి ఉంటుందట. అందుకే ఆ సంబంధిత పూజలలో ఉపయోగిస్తారట. కొత్త మోటార్ వాహనాలు, కార్లు, బైక్స్, ఇతర కొత్త వస్తువులపై కూడా నిమ్మకాయతో దిష్టి తీస్తారు. అలా చేస్తే వాటికి ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుందని నమ్ముతారు. సైంటిఫిక్‌గా దీని కోసం ఎలాంటి ప్రూఫ్ లేదు. ఇది కొందరి మూఢనమ్మకం మాత్రమే. అయితే, కొంతమంది వెటకారంగా, బంగారం లేదా వెండి వాడి కూడా దిష్టి తీస్తే బాగుంటుందని కౌంటర్స్ వేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: