ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ తన కొత్త మోడల్ బైక్ లను ఆవిష్కరించింది. భారత మార్కెట్ లో ‘‘మీటియోర్’’ అనే మోడల్ తో కొత్త బైక్లను లాంఛ్ చేయడానికి రెడీ అవుతోంది. థండర్ బర్డ్ 350 బైక్ స్థానంలో రీప్లేస్ చేసేందుకు వస్తున్న ఈ కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ మీటీయోర్ 350 మోడల్ కి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ మోడల్ బైక్ ప్రత్యేకతలను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. బైక్ ని చూస్తుంటే భారత మార్కెట్ లో అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాయల్ ఎన్ ఫీల్డ్ మీటియోర్ బైక్ కి సంబంధించిన బ్రోచర్ వివరాలను తెలుసుకోవచ్చు. ఈ బైక్ కొన్ని రకాల వేరియంట్లలో, ఎల్లో, బ్లాక్, బూడిద రంగుల్లో బైక్ ని పొందవచ్చు. ఫైర్ బాల్, స్టెల్లర్, సూపర్ నోవా వంటి మూడు మోడళ్లలో బైక్ మార్కెట్ లోకి విడుదల కాబోతోంది. ఈ మూడు వేరియంట్ల పేరుతో పాటు ప్రతి వేరియంట్ కు కలర్ ఆప్షన్, వివరాలు, నెవిగేషన్ వివరాలు, తదితర ప్రత్యేకతలను బ్రోచర్లు తెలియజేస్తున్నాయి.

రాయల్ ఎన్ ఫీల్డ్ మీటియోర్ లీకైన చిత్రాలను చూసినట్లయితే బేస్ వేరియంట్ అయిన ‘ఫైర్ బాల్’ లో ట్రిఫుల్ నావిగేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. సింగిల్ కలర్ ట్యాంకును కలిగి ఉండి బాడీ గ్రాఫిక్స్, డెకల్స్, కలర్ రిమ్ టేప్, బ్లాక్ అవుట్ కాంపోనెంట్స్, మెషిన్డ్ ఫిన్స్ తో కూడి ఇంజిన్ ను ఏర్పాటు చేశారు. ఫైర్ బార్ మోడల్ బైక్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఒకటి ఎల్లో, ఇంకొకటి రెడ్.

స్టెల్లార్ మోడల్ బైక్ లో ట్రిఫుల్ నావిగేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ప్రీమియం బ్యాడ్జిలు, క్రోమ్ ఫినిష్డ్ ఎలిమెంట్స్ తో కూడిన ఎగ్జాక్ట్ మోడల్ కలిగి ఉంది. హ్యాండిల్ బార్స్ లో ప్రత్యేక ఫీచర్లను ఏర్పాటు చేశారు. స్టెల్లార్ వేరియంట్ లో పిరియన్ రైడర్స్ కోసం బ్యాక్ రెస్ట్ ను ఏర్పాటు చేశారు. దీంతో సాఫీగా కూర్చోవచ్చు. బాడీ కలర్ కాంపోనెట్స్ విషయానికి వస్తే ఈ మోడల్ బైక్ మెటాలిక్ రెడ్, మ్యాట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ కలర్ లో అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: