జీఎస్టీ కౌన్సిల్ (GST Council) 43 వ సమావేశం మే 28 (శుక్రవారం)న జరగనుంది. వస్తువుల, సేవల పన్ను (GST) కౌన్సిల్ మే 28 న ఉదయం 11 గంటలకు రాజధానిలో సమావేశమవుతుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మే 15 న ప్రకటించారు. ప్రతిపాదిత జీఎస్టీ పన్నుల సడలింపుతో పాటు ప్రస్తుత జీఎస్టీ పరిహారాలను పరిష్కరించడం వంటి ముఖ్యమైన సమస్యలను ఈసారి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. GST కౌన్సిల్ చివరిసారిగా అక్టోబర్‌లో సమావేశమైంది మరియు రిటైల్ ఇంధన ధరలను రికార్డు స్థాయికి నెట్టివేసిన అధిక పన్ను భారాన్ని తగ్గించడానికి GST పాలనలో పెట్రోలియం ఉత్పత్తులను చేర్చడం వంటి అనేక పెండింగ్ సమస్యలను ఈసారి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. పలు ముఖ్యమైన వస్తువులపై GST రేట్లు తగ్గించడంపై ఈ కౌన్సిల్ లో చర్చించే అవకాశం ఉందని పలు వర్గాల నుంచి వచ్చిన సమాచారం ద్వారా అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: