టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, నాగార్జున నట వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తన మొదటి సినిమా జోష్ తో ఎంట్రీ ఇచ్చిన,ఆ తర్వాత ఏంమాయ చేసావే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగచైతన్య 100% లవ్, తడాఖా, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్, లవ్ స్టోరీ తదితర చిత్రాలతో భారీ క్రేజ్ అందుకున్నారు. ఇటీవల తండేల్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఎన్నో చిత్రాలలో నటించిన నాగచైతన్య జగపతిబాబు హొస్టుగా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే షోకి గెస్ట్ గా వచ్చారు.



ఈ షోలో నాగచైతన్య తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను కూడా తెలిపారు. ముఖ్యంగా తన తండ్రి నాగార్జునతో కలిసి నటించడం గురించి ఒక పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. నాన్నకు ఏదైనా సరే ఒక పట్టాన నచ్చదని, నాన్న ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలా చూస్తూ, చాలా కేర్ తీసుకుంటారని, ముఖ్యంగా నా క్యారెక్టర్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంటారని తెలిపారు.


 అందుకే సినిమా షూటింగ్లలో చాలా టేకులు, కథలలో మార్పులు  తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు చైతన్య, ఈ విషయాలు తనని చాలా ఇబ్బందిగా అనిపిస్తాయని,  అందుకే నాన్నతో సినిమా అంటే అంతే.. అంటు తెలిపారు నాగ చైతన్య.  అలాగే తమ కుటుంబమంతా కలిసి నటించిన మనం సినిమా విషయంలో నాన్న (నాగార్జున)ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు నాగచైతన్య. ఈ సినిమా షూటింగ్ అయ్యేవరకు చాలా కఠినంగా ఉన్నారు తాను గతంలో ఎప్పుడు నాన్నని అలా చూడలేదంటే తెలిపారు నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


నాగచైతన్య సినిమాలు విషయానికి వస్తే ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తోనే తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు డైరెక్టర్. నాగచైతన్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తీస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: