కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు తప్పనిసరిగా వేయించుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ ఒకటే కరోనా నుంచి మనల్ని కాపాడే దివ్యౌషధమని చెబుతున్నారు. అయితే తాజాగా భారత దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్ వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి జైడస్ క్యాడిలా జై కొవ్-డీ దరఖాస్తు చేసుకుంది. 


భారతదేశంలో జై కొవ్-డీ అత్యవసర వినియోగానికి  జైడస్ క్యాడిలా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.. డిఎన్ఏ సాంకేతికతతో జై కొవ్-డీ  వ్యాక్సిన్ ని జైడస్ క్యాడిలా సంస్థ రూపొందించింది. ఇక ఇప్పటికే మూడో దశ ట్రైల్స్ పూర్తి చేసుకున్న ఈ జైడస్ క్యాడిలా  జై కొవ్-డీ ఇలా ఇప్పుడు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీనికి అనుమతి లభిస్తే భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: