తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరంలో ఓ దళిత యువకుడిని కొందరు దారుణంగా కొట్టారు. ఐదు రోజుల క్రితం ఓ పొలంలో పాలేరుగా పని చేస్తున్న ఎస్సీ యువకుడిపై కొందరు మూకుమ్మడిగా కొట్టారు. వైసీపీ నాయకులే ఈ దాడి చేశారని ఎమ్మార్పీఎస్‌ నేతలు అంటున్నారు. అసలేమైందంటే.. దివాన్ చెరువుకు చెందిన పడమట్ల శ్రీను తొమ్మిదేళ్లుగా వంకా మల్లిబాబు అనే రైతు వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు. మల్లిబాబుకు సంగిశెట్టి వీరవెంకట్రావు మధ్య పొలం వివాదం ఉంది.

వివాదంలో ఉన్నా మల్లిబాబు సాగు చేస్తున్నారు. దీన్ని  పొరుగు రైతు వ్యతిరేకిస్తూ పొలంలో పని చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. అయితే పాలేరు శ్రీను పొలంలో పని చేయడం చూసి.. సంగిశెట్టి వీరవెంకటరావు, యర్రా సత్తిబాబు, సంగిశెట్టి సాయి సంగిశెట్టి శివ మరో యాభై మంది శ్రీనుపై ఆరు రోజుల క్రితం విచక్షణా రహితంగా దాడి చేశారని ఎమ్మార్పీఎస్‌ నేతలు చెబుతున్నారు. వీరంతా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు అనుచరులని వీరు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనపై రాజానగరం పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: