గేమింగ్ యాప్, బెట్టింగ్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టేశారు.  ఈ ముఠా గత డిసెంబర్ లో వికారబాద్ జిల్లా చేవెళ్లకు చెందిన విద్యార్ధి ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా ఖాతాలోని 98.47లక్షల రూపాయలు కొట్టేసిన విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ ఈ కేసు దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆ కేటుగాళ్లను  నోయిడా పట్టేశారు.


అక్కడి ఓ అపార్ట్ మెంట్ లో దాడులు నిర్వహించిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇప్పుడు నగరానికి తీసుకొచ్చారు. ఈ నిందితులపై పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు వారి నుంచి 193 సెల్‌ఫోన్లు, 21 ల్యాప్‌టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. 23 పిఓఎస్‌ యంత్రాలు, 416 చెక్‌బుక్స్, 233 డెబిట్ కార్డులు కూడా స్వాధీనం చేసుకన్నారు. అలాగే నిందితుల ఖాతాల్లోని సుమారు రూ. 42 కోట్లను సీజ్ చేసారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: