కొన్ని ద‌శాబ్దాల‌కు పూర్వం ఒత్తైన‌, పొడ‌వైన‌ వెంట్రుక‌ల‌తో మ‌న పూర్వీకులు ఉండేవారు. రానూ రానూ మారుతూ వ‌స్తున్న జ‌న‌రేష‌న్ ఆహార అల‌వాట్లు, వాత‌వ‌ర‌ణం మార్పులు, కాలుశ్యం న‌ష్టం వ‌ల్ల కేశాల‌కు ఎంతో హాని క‌ల‌గ‌చేస్తున్నాయి. అయితే జుట్టు రాలకుండా ఉండాలంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సహజసిద్ధమైన టిప్స్ పాటించి మీ జుట్టు రాలకుండా చేసుకోండి. అందమైన మీ శిరోజాలను కాపాడుకోండి. 


- ఆలివ్, కొబ్బరి, కనోల నూనెలను కాస్త వేడి చేయండి.  ఎక్కువ వేడి చేయకూడ‌దు. కాస్త చల్లగ అయ్యాక ఆ నూనెతో మీ జుట్టుకు మసాజ్ చేయండి. తర్వాత తలస్నానం చేయాలి. ఇది మంచి రిజ‌ల్ట్ ఇస్తుంది.


- ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయకండి. దీంతో చాలా ఇబ్బందులు వస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా వెచ్చగా ఉండే నీళ్లతో స్నానం చేయొచ్చు. 


- రాత్రి మీరు నిద్రపోయేముందు వెల్లుల్లి రసం, ఉల్లిపాయ రసం లేదా అల్లం రసంతో మీ జుట్టుకు మర్దన చేయండి. ఉదయం లేచాక తలస్నానం చేయండి. 


- తేనె, ఆలివ్ ఆయిల్‌ల మిశ్రమాన్ని జుట్టుకు రాసి కొద్దిసేపయ్యాక తలస్నానం చేసినా చాలు. వారానికి రెండు సార్లు ఈ విధంగా ప్రయత్నిస్తే జుట్టు పెరుగుదలలో ఆశించిన ఫలితాలు వస్తాయి. 


- గ్రీన్ టీ జుట్టు రాలడానికి అరికడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల హెయిర్ రూట్స్ కు బలాన్ని అందిస్తుంది. 


-  సొరకాయాల రసాన్ని మీ జుట్టు రుద్దండి. అరగంట తర్వాత తలస్నానం చేయండి. దీని ద్వారా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: