ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేసారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి అనేది వేగంగా పెరుగుతుందని ఆయన అన్నారు. కరోనా ఈ స్థాయిలో ఉన్న సమయంలో పదో తరగతి పరిక్షలు అవసరమా అని ఆయన నిలదీశారు. తెలంగాణా తమిళనాడు ప్రభుత్వాలు పది పరిక్షలు పెట్టలేదని అన్నారు. 

 

తల్లి తండ్రులు ఆందోళనలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.  పదో తరగతి పరీక్షలను రద్దు చెయ్యాలి అని తల్లి తండ్రులు విద్యార్ధులు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఏడాదిలో నాశనం మినహా అభివృద్ధి ఎక్కడా లేదని అన్నారు ఆయన. పది పరిక్షలు అవసరం లేదని రద్దు చెయ్యాలి అని డిమాండ్ చేసారు. తప్పుడు ప్రచారాలు చేయడం ఎంత మాత్రం సరికాదని చంద్రబాబు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: