ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లా సామ‌ర్ల‌కోట‌లో ఓ ఎస్సై వ్య‌వ‌హారంపై స్థానికులు తీవ్రంగా ఆగ్ర‌హ‌మ‌య్యారు. బిక్క‌వోలు ఎస్సై సామ‌ర్ల‌కోట‌లో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. సెల‌వుపై తాను అత్త‌గారింటికి వెళ్లాడు. సామ‌ర్ల‌కోటలో రెండు ద్విచ‌క్ర వాహ‌నాల‌కు చ‌లానా విధించాడు. సెల‌వు స‌మ‌యంలో సామ‌ర్ల‌కోట మండ‌లం పండ్రావాడ గ్రామానికి వ‌చ్చిన ఎస్సై జరిమానా విధించ‌డం దారుణ‌మ‌ని వాహ‌న‌దారులు వాపోయారు.

చ‌లానాలు కూడ భారీగానే ఉన్నాయి. ఓ బైకుకు రూ.5035 ఫైన్ వేయ‌గా.. మ‌రొక బైకుకు రూ.10,070 చ‌లానా వేశాడు. ఆన్‌లైన్ ద్వారా రెండు ద్విచక్ర‌వాహ‌నాల‌కు జ‌రిమానా విధించాడు. గ‌తంలో వేసిన చ‌లాన్ల‌తో క‌లిపి మొత్తం అయిందా..?  లేక తాజాగా భారీగా వేశారా అన్న‌ది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అత్తారింటికి వ‌చ్చి జ‌రిమానా వేసిన ఎస్సై శ్రీ‌నివాస్‌ను ప‌లువురు నిల‌దీశారు. ఎస్సై తీరుపై గ్రామానికి చెందిన వాహ‌న‌దారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.  ఎస్సై అత్త‌గారింటివ‌ద్ద‌కు వ‌చ్చిన గ్రామ‌స్తుల‌పై ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. మ‌ర‌ల దౌర్జ‌న్యం కింద కేసు బుక్ చేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చాడు ఎస్సై. గ్రామ‌స్తులు సైతం ఎస్సైకి ధీటుగా కౌంట‌ర్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ ర‌వీంద్ర‌నాథ్‌బాబుకు ఫిర్యాదు చేస్తాం అని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
మరింత సమాచారం తెలుసుకోండి: