దేశ ఆర్థిక వ్యవస్థ పై కరోనా ప్రభావం బాగానే ఉంది. కేవలం ఆరునెలలు దేశంలో అన్ని స్థంబించిపోతే ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థ ఓ కొలిక్కి రాలేదంటే కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ప్రజలు పిల్లులు వదిలి సిటీ బాటపట్టలేదు. తద్వారా ఆర్థిక పరిస్థితి రోజు రోజు కి క్షీణించిపోతుంది. దాంతో ఆటోమేటిక్ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.. అయితే తాజా సమాచారం ప్రకారం  రానున్న రోజుల్లో ఇంట్లోకి ఏ వస్తువైనా కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందేమో అన్నట్లు మన దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది.

ఈ కొత్త సంవత్సరంలో మన ఇంట్లో వాడే వస్తువులు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ లాంటి వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయట. దాంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.  కొత్తేడాదిలో టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మిషన్‌లు.. ఇలా ఏదో ఒకటి కొనుగోలు చేయాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారు ఈ రెండు మూడు రోజులు చేస్తే మంచిది కొత్త ఏడాదిలో రేట్లు ఒక్కసారి గా పెరిగిపోతున్నాయని చెప్తున్నారు..  కొత్తేడాదిలో అదో గుర్తుగా మిగిలిపోతుందని బాయించే వారు ఇప్పుడే ఆ వస్తువులను కొనాలని చెపుతున్నారు..

జనవరి 1 నుంచి ఈ వస్తువుల ధరలు ఏకంగా 7 నుంచి 8 శాతం పెరగనున్నాయి.  ఈ విషయాన్ని సదరు కపెంనీలే స్వయంగా ప్రకటించాయి. రాగి, అల్యూమినియం, స్టీల్‌ వంటి ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడమే ఎలాక్ట్రానిక్‌ గృహోపకరణాల ధరల పెంపునకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే గత పదేళ్లలో ఇలా ఒకేసారి ఇంతలా  ధరలు పెరిగిన దాఖలాలు లేవని బిజినెస్‌ నిపుణులు చెబుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న ప్రజలకు ఈ ధరల పెరుగుదల మరింత భారంగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: