విశాఖ వన్‌టౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో  ఒంటరిగా నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలిని హత్యచేసిన ఘటన  ఆలస్యంగా వెలుగు లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిన‌దే. పూర్ణామార్కెట్ లో వృద్ధురాలు హత్య కేసును  పోలీసులు ఇవాళ చేదించారు. పూర్ణామార్కెట్‌ సమీపంలోని పెరికివీధిలో నల్లి అచ్చయ్యమ్మ (60) అనే వృద్ధురాలు నివాసం ఉంటున్న‌ది. ఈమె భర్త చాలా కాలం క్రిత‌మే మ‌ర‌ణించగా.. ఇద్దరు కొడుకులు వేరు కాపురం పెట్టుకుని నివ‌సిస్తున్నారు.  పూర్ణామార్కెట్‌ సమీపంలో నివాసం ఉన్న అచ్చయ్యమ్మ కొన్నేండ్ల క్రిత‌మే పెరికి వీధిలో ఇల్లు కొనుక్కుని అక్కడికి మారింది.

శ‌నివారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో అచ్చ‌య్య‌మ్మ సోద‌రి అక్క ఇంటికి వ‌చ్చింది. లోప‌ల త‌లుపులు పెట్టి ఉండ‌డంంతో ఎంత‌కు తెర‌వ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి కిటికిలోంచి తొంగిచూసింది. ఇంట్లో ఉన్న హాల్లో ఆమె అచేత‌నంగా ప‌డిఉండ‌డం గ‌మ‌నించి స్థానికుల‌కు స‌మాచారం ఇచ్చింది.  స్థానికుల స‌హాయంతో వ‌న్‌టౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ది. పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని త‌లుపులు తెరిచి చూడగా అప్ప‌టికే అచ్చ‌య్య‌మ్మ మృతి చెంది ఉంది.  

అనుమాన‌స్ప‌దంగా  అచ్చ‌య్య‌మ్మ మృతి చెందిన‌ట్టు పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు కొనసాగించారు పోలీసులు.  ఆదివారం  డీసీపీ విశాఖ సిటీ లా అండ్ ఆర్డర్ గౌతమి సాలి కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. వృద్ధురాలు నల్లి అచ్చియ్యమ్మ హత్య కేసులో చిన్న కొడుకు నాగశంకర్ నిందితుడుగా తేల్చారు. న‌వంబ‌ర్  4వ తేదీన చిన్న కొడుకు నాగ శంకర్ అచ్చ‌య్య‌మ్మ‌ ఇంటికొచ్చి ఆమెతో గొడవపడ్డాడు. గొడ‌వ‌లో బంగారం, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ల‌ను అడిగాడ‌ని, అవి ఆమె ఇవ్వ‌క‌పోవ‌డంతో నైలాన్ తాడుతో మెడ‌కు చుట్టి హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. అయితే ఆమె మెడ‌లో, చెవుల‌కు సంబంధించిన బంగారు ఆభ‌ర‌ణాలు కూడ కుమారుడు లాక్కున్నాడు. అవిలాక్కునే క్ర‌మంలోనే అడ్డుకుంటే గొంతును నులిమి నైలాన్‌తాడుతో మెడ‌కు చుట్టి హ‌త్య చేశాడ‌ని వివ‌రించారు.  


 

మరింత సమాచారం తెలుసుకోండి: