
ఇక ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసింది. కూతురుని దారుణంగా చంపేసిన తండ్రి ఎక్కడ పశ్చాత్తాప పడలేదు. అవును నిజంగానే నా కూతురుని నేనే చంపాను. ఆమె చేసిన పని నాకు అసలు నచ్చలేదు అందుకే ప్రాణాలు తీశాను అంటూ పోలీసుల ఎదుట కాస్త అయినా పశ్చాత్తాప పడకుండా చెప్పిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురి చేసాయ్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో వెలుగు చూసింది. కేశవపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి కూతురు ఉంది. ఇక శ్యాం నగర్ కు చెందిన యువకుడిని ప్రేమిస్తుంది యువతి.
అయితే కూతురు ప్రేమ వ్యవహారం తండ్రికి అస్సలు నచ్చలేదు. పద్ధతి మార్చుకోవాలి కూతురుని పలుమార్లు హెచ్చరించాడు ఆ తండ్రి. కానీ కూతురు తీరులో మాత్రం మార్పు రాలేదు. ప్రియుడుతో సంబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. ఇక ఇటీవలే పని ముగించుకుని తను ఇంటికి వచ్చిన సమయంలో కూతురు.. ప్రియుడుతో ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. దీంతో తండ్రి కోపం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన తండ్రి ఏకంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు గొంతు నలిమి చంపేశాడు. అయితే స్థానికులు ఇదంతా గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త ఆసుపత్రికి తరలించి నిందితున్ని అదుపులోకి తీసుకుంటే.. తండ్రి చెప్పిన మాటలతో పోలీసులు సైతం షాక్ అయ్యారు.