బ్యాంకులో డబ్బులు విత్ డ్రా చేసుకునే వారిని గమనించడం.. వారిని ఫాలో అవ్వటం సమయం చూసి డబ్బులు దొంగలించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవలే మధ్యప్రదేశ్లోని దామోలో కూడా ఇలాంటి ఓ ఘటన జరిగింది. సద్గువా గ్రామానికి చెందిన పటేల్ జి అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే ఇటీవలే బ్యాంకు నుంచి లక్ష రూపాయల నగదు విత్ డ్రా చేశాడు. మూడు రోడ్ల కూడలి దగ్గర ఉన్న పండ్ల దుకాణంలో మామిడిపండ్లు కొనుక్కుందామని అనుకున్నాడు. అయితే ఈ సమయంలోనే కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాడు. డబ్బులు ఉన్న బ్యాగ్ ని తన బైక్ పై పెట్టి పండ్ల వ్యాపారి తో బేరం ఆడటం మొదలు పెట్టాడు.
ఇంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఇక బైక్ పై ఉన్న డబ్బులు తీసుకుని ఆ తర్వాత పక్కనే వచ్చిన మరో బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. డబ్బులు సంచి తీసుకుని పారిపోతున్న దొంగలను చూసి రైతు పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా రోడ్డు మీద పట్టపగలు అందరూ చూస్తుండగానే బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు డబ్బుల బ్యాగ్ ఎత్తుకెళ్లిన దృశ్యాలు ఒక సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇక ఈ వీడియోలు క్లాస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు..