ముస్లిం రిజర్వేషన్ల అంశం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల చేవెళ్ల సభలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అంశంపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి షబీర్‌ అలీ మండిపడ్డారు.


దేశంలో అంబేద్కర్‌ రాజ్యాంగం నడుస్తుందా బీజేపీ రాజ్యాంగం నడుస్తుందా అని మాజీ మంత్రి షబీర్‌ అలీ ప్రశ్నించారు. అమిత్‌ షా  హోంమంత్రిగా పనికి రాడన్న షబీర్‌ అలీ ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామనడం బీజేపీ ఆహంకారానికి నిదర్శనమన్నారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు చెబితే నిరుపేదలైన ముస్లిం మైనారిటీలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తించేట్లు సవరణ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీవో తెచ్చినట్లు మాజీ మంత్రి షబీర్‌ అలీ వివరించారు.


పేద ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను తొలగిస్తామంటే ఎలా అని మాజీ మంత్రి షబీర్‌ అలీ ప్రశ్నించారు. హోంమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా ఎలా మాట్లాడుతారని మాజీ మంత్రి షబీర్‌ అలీ నిలదీశారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదన్న ఆయన అమిత్ షా పై రాజ్యాంగ పరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి షబీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. అమిత్ షా వాఖ్యలపై సుప్రీంకోర్టు లో పిటీషన్ వేస్తామని మాజీ మంత్రి షబీర్‌ అలీ అన్నారు.


దేశ ప్రజలకు హోంమంత్రిగా ఉంటున్న అమిత్‌ షా ఓక వర్గానికి ఎలా వత్తాసు పలుకుతాడని మాజీ మంత్రి షబీర్‌ అలీ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్లు చెబుతున్న ఈటెల రాజేందర్‌కు ఇన్ని కోట్లు ఏలా వచ్చాయని మాజీ మంత్రి షబీర్‌ అలీ నిలదీశారు. మునుగోడు ఉప ఎన్నికల జరిగిన 6 నెలల తర్వాత ఈటెల ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏంటని మాజీ మంత్రి షబీర్‌ అలీ ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: