క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే ఉంది. అప్పుడెప్పుడో 1978లో మొదటిసారి చంద్రబాబునాయుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఎంఎల్ఏగా గెలిచారంతే. తర్వాత 1983లో పోటీచేసినా టీడీపీ అభ్యర్ధి మీసాల నాయుడు చేతిలో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ లో నుండి టీడీపీలోకి దూకేశారు. 1984లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో చంద్రబాబు అసలు పోటీనే చేయలేదు. 1989లో చంద్రగిరిని వదిలేసి మారుమూలగా ఉన్న కుప్పం నియోజకవర్గానికి పారిపోయారు. అప్పటినుండి మళ్ళీ చంద్రిగిరి వైపు చూసిందేలేదు. ఎంఎల్ఏగా ఉన్నా, మంత్రిగా పనిచేసినా చివరకు సీఎం అయినా కూడా చంద్రగిరి గురించి చంద్రబాబు ఆలోచించింది పెద్దగా లేదనే చెప్పాలి.




ఇప్పుడిదంతా ఎందుకంటే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతిలో రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో చంద్రగిరి వైసీపీ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియోజకవర్గంలో ఏకంగా ఆక్సిజన్ సౌకర్యంతో  150 పడకలను ఏర్పాటుచేశారు. చంద్రగిరి హెడ్ క్వార్టర్స్ లోని ప్రభుత్వాసుపత్రిలో 100 పడకలను ఏర్పాటు చేశారు. మిగిలిన 50 పడకలను నారావారిపల్లెలోని ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు. నారావారిపల్లె అంటే చంద్రబాబు సొంత గ్రామం అని అందరికీ తెలిసిందే. నిజానికి చంద్రబాబుకు చిత్తశుద్ది ఉండుంటే చంద్రగిరి ఎప్పుడో బ్రహ్మాండంగా డెవలప్ అయ్యుండేదే. చంద్రబాబు అధికారంలో ఎన్ని సంవత్సరాలున్నా చంద్రగిరిలో స్కూళ్ళను, ఆసుపత్రులను బాగుచేసిందే లేదు. జనాలకు ఉద్యోగ, ఉపాధి కోసం పరిశ్రమలను పెట్టింది కూడా లేదు.




ఏ నేతైనా అభివృద్ధిలో ముందు తన నియోజకవర్గాన్ని, జిల్లాకు ప్రాధాన్యతిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం చంద్రగిరిని పెద్దగా పట్టించుకున్నదే లేదు. కరోనా కష్టకాలంలో తన సొంతూరిలోని ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యాలతో ఓ 50 పడకలను ఏర్పాటు చేయాలని అనుకుంటే చంద్రబాబుకు పెద్ద కష్టంకాదు. కాకపోతే సొంతూరిని ఆదుకోవాలనే మనసే లేదు. ఇదే విధమైన పద్దతి కుప్పంలో కూడా కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా 13 ఏళ్ళునా కుప్పం అభివృద్దికి చేసింది కూడా పెద్దగా లేదు. ఏదో రొటీన్ లో జరిగే డెవలప్మెంటే తప్ప ముఖ్యమంత్రి నియోజకవర్గంగా జరగాల్సిన ప్రత్యేక అభివృద్ధి అయితే లేదు. చంద్రబాబు నైజాన్నే వైసీపీ ఎంఎల్ఏ చెవిరెడ్డి బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్ధితిలో ఆక్సిజన్ సౌకర్యంతో 150 పడకలు అదికూడా సొంత ఖర్చులతో ఏర్పాటు చేయటమంటే మామూలు విషయం కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: