
ఇదిలావుంటే.. మరో కీలక విషయం కూడా జగన్ నోటి నుంచి వచ్చింది. నియోజకవర్గాల్లో నిర్వహించే ఏ కార్యక్రమానికైనా.. మీరే ఖర్చు పెట్టుకోవాలని జగన్ తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై చేపట్టే ఏ కార్యక్రమాని కైనా అందరూ హాజరు కావాలని సూచించారు. దీనికి జనసమీకరణ చేయాలని.. దానికి అయ్యే ఖర్చును నాయకులే భరించాలని తేల్చి చెప్పారు. అయితే.. దీనిపైనే నేతలు దూరంగా ఉంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. వారు మౌనంగా ఉన్నారు.
జగన్ చెప్పినట్టే.. ఇప్పుడు నియోజకవర్గాల్లో ఆందోళనలు, నిరసనలు, పార్టీ కార్యక్రమాలు చేపట్టి.. ఖర్చు చేస్తే.. ఎన్నికల సమయానికి తమ పరిస్థితి ఏంటన్నది వారి ప్రశ్న. ఈ క్రమంలో రెండు రకాల ప్రశ్నలు వారు సంధిస్తున్నారు. 1) ఇప్పుడు ఖర్చు పెట్టుకుని పార్టీని డెవలప్ చేస్తే.. టికెట్ మాకే ఇస్తారన్న గ్యారెంటీ ఏంటి? అనేది వారి ప్రశ్న. ఇది గతంలోనూ నిరూపితమైంది. అప్పటి వరకు నాయకులు రెడీ అయినా.. హఠాత్తుగా వారిని మార్చేశారు. దీంతో ఇప్పుడు అదే సమస్య వెంటాడుతోంది.
ఇక, 2) ఇప్పుడు నిధులు ఖర్చు పెట్టేస్తే.. ఎన్నికల సమయానికి తమ వద్ద నిధుల కొరత వస్తే.. ఏంటి? ఏం చేయాలి? పార్టీ ఇస్తుందా? అనేది మరో కీలక సందేహం. ఈ రెండు కారణాలతో జగన్ చెప్పిన మాటను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరూ ముందుకు కూడా రావడం లేదు. అంతేకాదు.. ఇప్పుడు ఇదే వైసీపీ నాయకుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఇలాగే ఖర్చులు పెట్టుకోమని చెప్పి, తీరా ఎన్నికల్లో వేరే వాళ్లకు టికెట్లు ఇచ్చారని అంటున్నారు. మరి ఈ వ్యవహారంపై జగన్ స్పందించి నాయకులకు భరోసా ఇస్తే తప్ప.. నియోజకవర్గాల్లో జెండాలు ఎగిరే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు