నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.. అందు లో భాగంగా పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా మరొక నోటిఫికేషన్ ను విడుదల చేసారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇటీవల సంస్థ నుంచి వరుస గా ఉద్యోగ ప్రకటనలు విడుదలవుతున్నాయి. తాజాగా సంస్థ నిరుద్యోగుల కు మరో గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 72 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.


టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్ విభాగాల్లో ఈ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు అనుభవం, విద్యార్హత ఆధారంగా నెలకు రూ. 47 వేల నుంచి రూ. 67,700 వరకు వేతనం చెల్లించనున్నారు.

టెక్నికల్ ఆఫీసర్/డీ-మెకానికల్ విభాగంలో 28 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల కు ఎంపికైన వారికి నెలకు 67,700 వరకు వేతనం చెల్లించనున్నారు.

టెక్నికల్ ఆఫసీర్/డీ- సివిల్ విభాగం లో 12 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.67,700 వరకు వేతనాలు చెల్లించనున్నారు.
 
మెడికల్ ఆఫీసర్/డీ(స్పెషలిస్ట్స్) విభాగంలో 8 ఖాళీలు ఉన్నాయి, ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.67,700 వరకు వేతనం చెల్లించనున్నారు.

టెక్నికల్ ఆఫీసర్/డీ-ఎలక్ట్రికల్ విభాగంలో 10 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 వరకు వేతనం చెల్లించనున్నారు.

స్టేషన్ ఆఫీసర్/A విభాగంలో 4 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.47,600 వరకు వేతనం చెల్లించనున్నారు.

ఎంబీబీఎస్, ఎంబీఏ, బీఈ/బీటెక్ కోర్సులను గుర్తింపు పొందిన సంస్థలు, యూనివర్సిటీ నుంచి పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడవచ్చును..

మెడికల్ ఆఫీసర్ విభాగాల్లో ఎనిమిది ఖాళీలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: