ఇండియన్ కోస్ట్ గార్డ్ ముంబైలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజియన్ (వెస్ట్) పరిధిలోని వివిధ సబ్-ఆఫీస్‌లలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 96 సివిలియన్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 31, 2022. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, indiancoastguard.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ సివిలియన్ రిక్రూట్‌మెంట్ 2022 వివరాలు

ఇంజిన్ డ్రైవర్: 05 పోస్టులు

సారంగ్ లాస్కర్: 02 పోస్ట్‌లు

ఫైర్ ఇంజన్ డ్రైవర్: 05 పోస్టులు

ఫైర్‌మెన్: 53 పోస్టులు

సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్: 11 పోస్టులు

మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్: 05 పోస్టులు

స్టోర్ కీపర్: 03 పోస్టులు

స్ప్రే పెయింటర్: 01 పోస్ట్

మోటార్ ట్రాన్స్‌పోర్ట్ మెకానిక్: 01 పోస్ట్

లాస్కర్: 05 పోస్ట్‌లు

మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్): 03 పోస్టులు

లేబర్: 01 పోస్ట్

ఇండియన్ కోస్ట్ గార్డ్ సివిలియన్ రిక్రూట్‌మెంట్ 2022 అర్హత ప్రమాణాలు

ఇంజిన్ డ్రైవర్: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమానం అయి ఉండాలి

సారంగ్ లాస్కర్: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డ్ నుండి మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి లేదా తత్సమానం అయి ఉండాలి

ఫైర్ ఇంజన్ డ్రైవర్: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి లేదా మూడు సంవత్సరాల అనుభవంతో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి

ఫైర్‌మ్యాన్: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి

సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్: అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి చదివి ఉండాలి మరియు హెవీ, లైట్ మోటారు వాహనాల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌ని కలిగి ఉండాలి.

మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు లేదా ITI నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా & రెండేళ్ల అనుభవం.

స్టోర్ కీపర్: అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి ఇంకా స్టోర్‌లను మెయింటైన్ చెయ్యడంలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి

స్ప్రే పెయింటర్: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా  సంబంధిత ట్రేడ్‌లో 02 సంవత్సరాల అనుభవం ఉండాలి.

మోటార్ ట్రాన్స్‌పోర్ట్ మెకానిక్: అభ్యర్థి తప్పనిసరిగా మెట్రిక్యులేషన్ లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ డిప్లొమా ఇంకా ఆటోమొబైల్ వర్క్‌షాప్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.

లాస్కర్: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా బోట్‌ సేవలో మూడేళ్ల అనుభవం ఉండాలి.

మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్): అభ్యర్థి తప్పనిసరిగా మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి ఇంకా ఆఫీస్ అటెండెంట్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి.

లేబర్: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి లేదా గుర్తింపు పొందిన సంస్థల నుండి  ITI ఇంకా ట్రేడ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31, 2022న లేదా అంతకు ముందు ఆఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం యూనిట్లలోని సంబంధిత కమాండర్ కార్యాలయాలకు మాత్రమే ఆర్డినరీ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్షలు ఇంకా ట్రేడ్/స్కిల్ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: