నేటి కాలంలో గుండె పోటు బాధితులు చాలా ఎక్కువైపోతున్నారు.యువతలో కూడా భారీగా గుండెపోటు బాధితులు పెరిగిపోతున్నారు. ప్రతి ఏటా కూడా ఎన్నో లక్షలాది మంది ఈ గుండె పోటు రోగంతో ప్రాణాలు కోల్పోతున్నారు .అందుకే గుండె పోటు బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే ముందే జాగ్రత్త పడడం చాలా మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఈ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతి రోజూ కూడా ఖచ్చితంగా 6000 నుంచి 9000 అడుగులు (సుమారు 1-3 కిలోమీటర్లు) నడవాలి.ఎందుకంటే ఇలాంటి నడవడం వల్ల గుండెపోటు ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది.  60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు రోజుకు 6000 నుండి 9000 అడుగులు నడవాలని, ఇలా నడిస్తే గుండెపోటు ప్రమాదం రాకుండా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది. గుండెపోటు మాత్రమే కాకుండా పక్షవాతం ముప్పు 40 శాతం నుండి 50 శాతం వరకు తగ్గిందట. అలాగే రోజూ 7000 నుంచి 10,000 అడుగులు నడవడం వల్ల గుండె ఆరోగ్యానికి ఖచ్చితంగా మంచి మేలు చేకూరుతుందని  తేలింది.


లిఫ్ట్‌కు బదులు మెట్లను ఎక్కడం మీ కారును దూరంగా పార్క్ చేసి ఆఫీసుకు చేరుకోవడం,చిన్న చిన్న పనులకు కారును వాడకుండా నడవడం వంటి పనులతో 7000 నుండి 10,000 అడుగులు నడవడం వల్ల గుండె పోటు ముప్పు వచ్చే ప్రమాదం తగ్గుతుందట.ఫస్ట్ మీరు ఒక వారం పాటు ప్రతిరోజూ 500 అడుగులు నడవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత  క్రమంగా పెంచుకోండి. ఇలా నడవడం వల్ల గుండె ఇంకా రక్తనాళాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. రోజుకు 6,000 కంటే ఎక్కువ స్టెప్స్ తీసుకోవడం వల్ల కండరాలలో ఇన్సులిన్ నిరోధకత కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. ఇది గుండె ఇంకా రక్తనాళాలకు చాలా మేలు చేస్తుంది. ఇంకా అలాగే రక్తపోటు, శరీర బరువును నియంత్రించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇక వృద్ధాప్యంలో ఎక్కువ నడవడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి. అలాగే శారీరకంగా ఇంకా మానసికంగా ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారు. ఒక నిమిషంలో సుమారు 100 అడుగులు వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి: