
శరీరానికి అవసరమైన డి విటమిన్ ఎక్కువగా సూర్య కాంతి నుంచి మనకు లభిస్తుంది. దీనివల్ల చర్మం పైన ఉండేటువంటి 7 డిహైడ్రోకొలెస్ట్రాల్ అనే అనువుని సైతం ఉత్పత్తి చేస్తుంది. ఇది ఉత్పత్తి కావడానికి సూర్య కాంతి నుంచి వచ్చే UV కాంతి సహాయంతోనే విటమిన్ D-3తయారవుతుంది. ఇది మన శరీరానికి కాలేయం, మూత్రపిండాల ద్వారా అందించేలా చేస్తాయి. ప్రస్తుతం ఉన్న జీవనశైలిలోని మార్పుల వల్ల మహిళలు ఎండలో గడపలేని పరిస్థితి ఏర్పడింది.వాకింగ్ కూడా సాయంత్రం ఉదయం నీడ సమయంలోనే చేస్తున్నారు.
సాధారణంగా యువి కిరణాలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలోనే ఎక్కువగా ఉంటాయి. సాయంత్రం వేళలో వచ్చేటువంటి కిరణాలు విటమిన్ D కి తయారు చేయడానికి ఉపయోగపడవు. అందుకనే ఉదయం 11 లేదా 2 గంటల మధ్య సమయాలలో కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు కాళ్లకు, చేతులకు, ముఖానికి ఎండ తగిలేలా చూసుకోవాలని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. మరి అలాగని ఎక్కువగా సూర్యకాంతి నేరుగా పడితే చాలా ప్రమాదం ఉంటుందట. చర్మ క్యాన్సర్లు, రెటీనా దెబ్బ తినడం మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి.
సూర్యరష్మితోనే కాకుండా మనం తినే ఆహారం ద్వారా కూడా విటమిన్ -D లోపాన్ని ఎదుర్కోవచ్చు.. ముఖ్యంగా చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, పాలు ఆహారంలో జోడించుకోవడం వల్ల వీటిని అధిగమించవచ్చు.
విటమిన్ D లోపం వల్ల మన శరీరంలో ఉండే అన్ని భాగాలు బలహీనమవుతాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఎముకలు, కండరాలు ,కీళ్ల నొప్పులు, చాలా తీవ్రంగా ఉంటాయి, చిన్న వయసులో కూడా మతిమరుపు అనేది వస్తుందట.. అలాగే ఆందోళన పడడం, జుట్టు ఊడిపోవడం, అలసట, ఇలా చాలా రకాల లోపాలు సంభవిస్తాయి. అందుకే రోజులో కనీసం కొన్ని నిమిషాలైనా సూర్యకాంతి పడేలా చూసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.