సాధారణంగా ఇటీవల కాలంలో ముఖ్యంగా మన భారత దేశంలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇక రోజు రోజుకి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం , మధుమేహానికి దారి తీయడం జరుగుతుంది. అందుకే ఈ వ్యాధి బారిన పడిన వారు ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక షుగర్ ను నియంత్రించడానికి కొన్ని రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని తినడం వల్ల పోషకాలు లభించడంతో పాటు చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇక చక్కెర వ్యాధి కలిగిన వారు ఎలాంటి పండ్లు తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1.పీచ్:
తాజాగా ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం మధుమేహ రోగులు పీచ్ పండ్లను తినవచ్చు . ఇందులో ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. అలాగే విటమిన్ ఇ,  విటమిన్ సి,  పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలోకి వస్తుంది. ఇక పీచ్ లో ఉండే బయో ఆక్టివ్ సమ్మేళనం కారణంగా మధుమేహం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతోపాటు ఊబకాయం కూడా దూరం అవుతుంది. ప్రతిరోజు కడుపులో మంట తగ్గడమే కాకుండా.. రోగనిరోధక వ్యవస్థ,  జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది..


2. నేరేడు పండ్లు:
వేసవి కాలంలో విరివిగా లభించే నేరేడు పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి . అవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతాయి. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు స్టార్చ్ ను  శక్తి గా మార్చడానికి అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.


3. జామ పండ్లు:
తక్కువ క్యాలరీలు.. అధికంగా ఫైబర్ లభించడం వల్ల నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కణాల ద్వారా నెమ్మదిగా శక్తిని గ్రహిస్తుంది. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: